Site icon HashtagU Telugu

Twitter 2 Features : ట్విట్టర్ వీడియోలకు 2 కొత్త ఫీచర్లు

X Prices

X Prices

ట్విట్టర్‌లో ఒకదాని తర్వాత ఒకటిగా కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ట్విట్టర్ వీడియోలను చూసే క్రమంలో యూజర్స్ కు మరింత కంఫర్ట్ ను అందించే  ఇంకో 2 కొత్త ఫీచర్లు (Twitter 2 Features) వచ్చే వారం యాడ్ కాబోతున్నాయి.  ఆ ఫీచర్ల (Twitter 2 Features) వివరాల్లోకి వెళితే.. వీడియోను  15 సెకన్లు ఫార్వర్డ్, 15 సెకన్లు బ్యాక్ సీక్ చేసేందుకు వీడియోపై రెండు బటన్స్ వస్తాయి.  ఇక రెండో ఫీచర్ ముచ్చటలోకి వెళితే.. “పిక్ ఇన్ పిక్” అనే ఆప్షన్ కూడా వీడియో సెక్షన్ లో మనకు కనిపిస్తుంది.

also read : Twitter New CEO: ట్విట్టర్ కు కొత్త సీఈఓ.. 6 వారాల్లోగా బాధ్యతలు.. ప్రకటించిన ఎలాన్ మస్క్..!

ఒక వీడియోను చిన్న సైజులోకి మార్చేసి ఏదో ఒక మూలకు దాన్ని నెట్టి వాచ్ చేస్తూనే.. అదే సమయంలో ట్విట్టర్ చాట్స్ ను , వీడియో లిస్ట్ లను పైకి , కిందికి స్క్రోల్ చేసే ఫెసిలిటీనే  “పిక్ ఇన్ పిక్” అంటారు.  ప్రస్తుతం వాట్సాప్, యూట్యూబ్ సహా చాలా యాప్‍లలో ఈ ఫీచర్ ఉంది. ఇంతేకాదు త్వరలో వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్స్ కూడా ట్విట్టర్ లో అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఫోన్ నంబర్ లేకుండానే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఏ యూజర్‌తో అయినా మాట్లాడే అవకాశం కలుగుతుంది .

ట్విట్టర్ కు పోటీగా ఫేస్ బుక్ యాప్ 

ట్విట్టర్ కు పోటీగా ఇన్ స్టాగ్రామ్ ను పోలి ఉండే మరో కొత్త సోషల్ నెట్వర్కింగ్ సైట్ ను తీసుకువచ్చేందుకు ఫేస్ బుక్ సన్నాహాలు చేస్తోంది. ఇది జూన్ లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.  ఇన్ స్టాగ్రామ్ యూజర్లు ఈ కొత్త సైట్ కు  నేరుగా కనెక్ట్ అవ్వొచ్చని అంటున్నారు. ఇది ట్విట్టర్ తరహాలో టెక్ట్స్, టైమ్ లైన్ పోస్టులతో యూజర్లకు అందుబాటులోకి రానుంది.  ఇప్ప‌టికైతే అధికారికంగా ఈ యాప్‌కు పేరు పెట్ట‌లేదు. అయితే `పీ92`…  `బార్సిలోనా` అనే ఇంట‌ర్న‌ల్ పేర్ల‌తో పిలుస్తున్నారు.