ప్రపంచం సామాజికంగా..సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో మానవ సంబంధాలు పూర్తిగా మంటకల్సిపోతున్నాయి. మంచి చెడు ఏదీ ఆలోచించకుండా కొంతమంది దారుణాలకు తెగబడుతున్నారు. వావి వరుసలు లేకుండా లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. కొన్ని విషయాల్లో తప్పని తెలిసి కూడా…క్షణాలు ఆనందం కోసం అఘాత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపై ఎన్నిచర్యలు తీసుకున్నా….వారి బుద్ధి మాత్రం మారడం లేదు. తాజాగా జరిగిన ఓ సంఘటనపై సామాజిక వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
అచ్చం అన్నలా ఉన్న కవల సోదరుడు తన రూపు రేఖలను వాడుకుని అఘాత్యానికి పాల్పడ్డాడు. వదిన తనను గుర్తించకపోవడంతో…ఆమెపై నెలలుగా అత్యాచారానికి తెగబడ్డాడు. చివరికి అసలు నిజం బయటపడటంతో…ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ప్రస్తుతం నాలుగు గోడల మధ్య ఊచలు లెక్కపెడుతున్నాడు. మహారాష్ట్రాలోని లాతూరులో జరిగిన ఈ ఘటన…ఓ కుటుంబంలోని అన్నాదమ్ములు ఇద్దరు కవలలు. వీరిలో అన్నకు ఆరు నెలల క్రితం పెళ్లి జరిగింది. సోదరులిద్దరూ కవలలు కావడం, శరీర సౌష్టవం ఒకేలా ఉండటం వారిలో ఎవరు ఎవరో గుర్తించడం కష్టంగా ఉండేది. దీనిని ఆసరగా తీసుకున్న తమ్ముడు…అన్న భార్యపై అఘాయిత్యానికి పాల్పడటం మొదలు పెట్టాడు. అన్న లేని సమయంలో వదినతో అచ్చం అన్నలా ప్రవర్తించి లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. ఆమె కూడా తనపై జరుగుతున్న దారుణాన్ని గుర్తించలేకపోయింది.
ఆరునెలల తర్వాత అనుమానం రావడంతో అసలు విషయంకు వచ్చింది. మరో ఆశ్చర్యకరమైన ఘటన ఏంటంటే…తనపై జరుగుతున్న అఘాయిత్యం గురించి భర్తకు చెప్పగా అతను చెప్పింది విని ఆమె షాక్ గురైంది. ఆ సంబంధాన్ని కొనసాగించాలంటూ భర్త చెప్పిన మాటలు ఆమెను నిర్ఢాంతపరిచాయి. అత్తింటివారు సమర్ధించడంతో…బాధితురాలు సహించక…అన్నదమ్ములిద్దరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేసింది.