Wonder Women : ఆమె నిద్రిస్తే క్యాన్సర్ పెరుగుతుంది.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన శాస్త్రవేత్త!

క్యాన్సర్.. ఈ వ్యాధి పేరు వినగానే చాలామంది భయంతో వణికి పోతూ ఉంటారు. ఈ ప్రాణాంతక వ్యాధికి ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ చాలా మంది ఈ క్యాన్సర్ వ్యాధి పేరు వింటే హడలి పోతూ ఉంటారు.

  • Written By:
  • Updated On - June 28, 2022 / 10:34 AM IST

క్యాన్సర్.. ఈ వ్యాధి పేరు వినగానే చాలా మంది భయంతో వణికి పోతూ ఉంటారు. ఈ ప్రాణాంతక వ్యాధికి ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ చాలా మంది ఈ క్యాన్సర్ వ్యాధి పేరు వింటే హడలి పోతూ ఉంటారు. అయితే ఈ క్యాన్సర్లలో కూడా రకరకాల పేర్లు ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, మెలనోమా క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ ఇలా ఎన్నో రకాలుగా క్యాన్సర్ ఉన్నాయి. వాటిలో రొమ్ము క్యాన్సర్ కూడా ఒకటి. దీనినే బ్రెస్ట్ క్యాన్సర్ అని కూడా అంటారు. తాజాగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ పై జరిగిన అధ్యయనంలో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న రోగులు నిద్రలో ఉన్నప్పుడు క్యాన్సర్ కణాలు కణతి నుంచి విడి పోయి ఇతర భాగాలకు మరింత ఎక్కువగా వ్యాపిస్తాయి అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. యూనివర్సిటీ ఆఫ్ బాసెల్ లోని ఆసుపత్రికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ అంశం బయటపడింది. సాధారణంగా క్యాన్సర్ వ్యాధిని తొలిదశలోనే గుర్తించి చికిత్స చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. క్యాన్సర్ కణాలు ఇతర భాగాలకు వ్యాపించడం మొదలైతే పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుతుందని, వైద్యపరిభాషలో కణాల వ్యాప్తిని మెటాస్టాసిస్ అని అంటారు.

ఇతర శరీర భాగాలకు చేరుకొని కొత్త కణితులు గా మారతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇదే విషయాన్ని ఎలుకల్లో క్యాన్సర్ సేల్స్ వ్యాప్తిని నిశితంగా పరిశీలించగా ఎలుకలు నిద్రిస్తున్న సమయంలో మెటాస్టాసిస్ అధికంగా జరుగుతున్నట్టు తేలింది. అయితే ఈ మెటాస్టాసిస్ తన తల నుంచి క్యాన్సర్ కణాలు నిత్యం విడుదల అవుతుంటాయి అని శాస్త్రవేత్తలు అనుకున్నప్పటికీ తాజా అధ్యయనంలో ఈ ప్రక్రియకు సంబంధించి ఒక కొత్త కోణం వెలుగులోకి తెచ్చింది. ఇక రొమ్ము క్యాన్సర్ లాగా ఇతర క్యాన్సర్ రకాల్లో కూడా ఇలాగే జరుగుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. రాత్రి పగలు సమయాల్లో జీవక్రియల స్థాయిని నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ దీనికి కారణమని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేతలు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే రోగులకు చికిత్స అందిస్తే వారు త్వరగా కోలుకునే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు.