Site icon HashtagU Telugu

IT Job To Goli Soda : పెద్ద జాబ్ వదిలేసి.. గోలీ సోడా బిజినెస్ పెట్టాడు

It Job To Goli Soda

It Job To Goli Soda

IT Job To Goli Soda : ఐటీ జాబ్ అంటే హాట్ కేక్.. శాలరీ భారీగా ఉంటుంది.. 

అలాంటి జాబ్ ను వదిలేయాలి అంటే.. దమ్ము ఉండాలి..

అంత సాహసం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు..

తెలంగాణకు చెందిన  తుల రఘునాథ్ తనకు తట్టిన బిజినెస్ ఐడియా కోసం బంగారు బాతు లాంటి ఐటీ జాబ్ ను వదిలేశాడు.. 

లక్షల్లో జీతం వచ్చే ఐటీ జాబ్ కంటే ఎక్కువగా రఘునాథ్ కు నచ్చిన ఆ బిజినెస్ ఐడియా ఏమిటో తెలుసా ?

గోలీ సోడా తయారీ బిజినెస్!!

కోయంబత్తూరుకు ఒకసారి వెళ్ళినప్పుడు.. రోడ్డు వెంట గోలీ సోడా(IT Job To Goli Soda) అమ్మే వాళ్ళను రఘునాథ్ చూశారు. అప్పుడే ఆయనకు ఆ బిజినెస్ చేయాలనే ఐడియా వచ్చింది. ఎప్పుడో  15-20 ఏళ్ల క్రితం కరీంనగర్‌లో తన చిన్నప్పుడు గోలీ సోడాను చూసిన సందర్భాన్ని ఆయన ఆ క్షణంలో గుర్తు చేసుకున్నారు. తరాలు మారినా.. గోలీ సోడాకు క్రేజ్ తగ్గలేదనే ఒపీనియన్ కు రఘునాథ్ వచ్చారు. ఇకపైనా దానికి డిమాండ్ తగ్గదని డిసైడ్ అయ్యారు. అందుకే ఆ బిజినెస్ చేస్తే.. నడవకపోవడం అనే ముచ్చటే ఉండదని అనుకున్నారు. ఒకవేళ ఈ ఐడియా ఫెయిల్ అయితే తనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని కూడా రఘునాథ్ భావించారు. ఒకసారి తన ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడియా గురించి..  కుటుంబ సభ్యులతో డిస్కస్ చేశారు. అయితే వాళ్ళు వెంటనే నో చెప్పారు. ఆ ఆలోచన మానెయ్ .. జాబ్ చేసుకో అని సలహా ఇచ్చారు. కొంతమంది ఫ్రెండ్స్ ను సలహా అడిగితే.. గోలీ సోడా బిజినెస్ చేయడం చాలా రిస్కీ అని చెప్పారు. అది సీజనల్ బిజినెస్.. ఏడాదంతా నడవదు అని రఘునాథ్ కు వివరించారు. ఇవన్నీ విన్న తర్వాత కొంతకాలం జాబ్ చేసిన రఘునాథ్.. చివరకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐటీ జాబ్ మానేసి.. గోలీ సోడా తయారీ యూనిట్ పెట్టేందుకు సిద్ధమయ్యాడు.

ఇంటిని తనఖా పెట్టి.. వ్యాపారం ప్రారంభించి.. 

గోలీ సోడా బిజినెస్ పెట్టేందుకు రఘునాథ్ తన జాబ్ కు రిజైన్ చేశారు. బిజినెస్ ను స్టార్ట్ చేసేందుకు రూ. 30 లక్షలు కావాలి. ఇందుకోసం 2020 సంవత్సరంలో ఆయన  తన ఇంటిని తాకట్టు పెట్టారు. అయినా డబ్బులు సరిపోక బయట కూడా చాలాచోట్ల అప్పులు చేశారు.  ఆ డబ్బులన్నీ కలిపి ఎట్టకేలకు గోలీ సోడా వ్యాపారాన్ని ప్రారంభించారు.  తన గోలీ సోడా బాటిల్ ను స్పెషల్ గా డిజైన్ చేయించారు. సోడాలో ఉండే పోషక విలువల సమాచారాన్ని బాటిల్ పై ప్రింట్ చేయించారు. లైసెన్స్‌లు, కావాల్సిన అన్ని పర్మిషన్స్ తీసుకున్నారు. ఇప్పుడు రఘునాథ్ గోలీ సోడా బిజినెస్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఆయన యూనిట్ లో 100 మంది జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బిజినెస్ లో ఆయన  క్షలు సంపాదిస్తున్నారు.

Exit mobile version