Site icon HashtagU Telugu

BR Naidu : కేటీఆర్‌తో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటి

TTD Chairman BR Naidu meet with KTR

TTD Chairman BR Naidu meet with KTR

TTD Chairman BR Naidu : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈరోజు నందినగర్ నివాసంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కేటీఆర్‌ సత్కరించారు. ఇక కేటీఆర్‌కి వెంకటేశ్వర స్వామివారి తీర్థప్రసాదాలు బీఆర్ నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ టీటీడీ చైర్మన్‌కి శాలువా కప్పి.. వెంకటేశ్వర స్వామి జ్ఞాపకను అందజేసారు. కేటీఆర్‌ని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దాదాపు 30 నిమిషాలు సమావేశం అయ్యారు. ఇప్పుడు వీరి సమావేశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.

ఇక తిరుపతి దేవస్థానం.. 24 మందితో కొత్త పాలకమండలి సభ్యుల పేర్లను వెల్లడించింది. ఇందులో టీటీడీ ఛైర్మన్‌గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు(బీఆర్‌ నాయుడు)కు అవకాశం కల్పించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతోపాటు మరో 23 మంది పాలక మండలి సభ్యుల పేర్లతో జాబితాను టీటీడీ అధికారికంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ట్రస్ట్ బోర్డు 54వ ఛైర్మన్‌గా మీడియా బారన్, బొల్లినేని రాజగోపాల నాయుడు బుధవారం (నవంబర్ 6, 2024) బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని బంగారు వాకిలిలో ఏర్పాటు చేసిన స్వల్పకాలిక కార్యక్రమంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి జె.శ్యామలరావు ఆయనతో ప్రమాణం చేయించారు.

Read Also: AP New Roads Policy: ఇకపై రాష్ట్ర రహదారుల్లో కూడా మోగనున్న టోల్ చార్జీలు…