TS : ఇకపై జీన్స్‌ టీషర్ట్సు బంద్‌..ఆర్టీసీ కీలక నిర్ణయం

TSRTC: ఇక మీదట ఆర్టీసీ ఉద్యోగులు(RTC employees) జీన్స్‌ ప్యాంట్లు, టీషర్ట్స్‌ వేసుకోకూడదని టీఎస్‌ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ అధికారులు, వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్, టీ షర్టులు ధరించి విధులకు హాజరు కావొద్దంటూ తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. టీఎస్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కాకుండా మిగతా వాళ్ళు అంత క్యాజువల్ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారని, అయితే ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా […]

Published By: HashtagU Telugu Desk
TSRTC MD Sajjanar issue orders on RTC employees' dresses

TSRTC MD Sajjanar issue orders on RTC employees' dresses

TSRTC: ఇక మీదట ఆర్టీసీ ఉద్యోగులు(RTC employees) జీన్స్‌ ప్యాంట్లు, టీషర్ట్స్‌ వేసుకోకూడదని టీఎస్‌ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ అధికారులు, వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్, టీ షర్టులు ధరించి విధులకు హాజరు కావొద్దంటూ తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. టీఎస్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కాకుండా మిగతా వాళ్ళు అంత క్యాజువల్ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారని, అయితే ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ సంస్థ ఎండీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. అందుకని ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులు అందరూ యూనిఫాం, ఫార్మల్ డ్రెస్సులోనే విధులకు హజరుకావాలని ఎండీ సజ్జనార్‌(MD Sajjanar) ఆదేశాలు జారీ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ డ్రెస్ లో కనిపిస్తారు.. బస్టాప్, బస్టాండ్ లలో సూపర్ వైజర్లు తెల్లరంగు దుస్తుల్లో కనిపిస్తారు. డిపోలు, ఇతర ఆర్టీసీ కార్యాలయాల్లో అధికారులు యూనిఫాం అంటూ ఏదీ లేదు. డ్రెస్ కోడ్ లేకపోవడంతో అందరూ జీన్స్, టీషర్ట్స్ దరిస్తున్నారు. కొంతమంది ఉన్నతాధికారులు ఈ తరహా వస్త్రధారణతో విధుల్లో కనిపిస్తున్నారు. దీన్ని ఎండీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. ఇటీవల ఆయన గుగుల్ సమావేశాలు నిర్వహించిన సమయాలో చాలా మంది జీన్స్, టీషర్టుల్లో కనిపించడం చాలా చికాకు తెప్పించిందని.. ఈ నేపథ్యంలోనే ఆయన సంస్థ గౌరవ ప్రదంగా ఉండే ఫార్మల్ డ్రెస్సుల్లోనే అధికారులు విధుల్లో కనిపించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆయా అధికారుల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు.

Read Also: Rs 4000 Pension : రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

మరోవైపు హైదరాబాద్ సైబరాబాద్ మాజీ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్‌ టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నో సంస్కరణలు, పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. నేరస్తుల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచిన సజ్జనార్ గతంలో సీఐడీ, ఇంటిలిజెన్స్ విభాగాల్లో పనిచేశారు. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అనేది ఆయన హిస్టరీలోనే లేదు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రయాణికులతో మమేకమవుతూ.. వారి ఇబ్బందులు తెలుసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కనీ వినీ ఎరుగని కొత్త స్కీములు అమలు చేస్తున్నారు. తాజాగా ఆర్టీసీ సిబ్బంది విషయంలో కీలక ఆదేశాలు వెలువడ్డాయి.

 

  Last Updated: 11 May 2024, 01:04 PM IST