TS Lawcet Key : లాసెట్ ఎగ్జామ్ కీ రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి

మే 25న జరిగిన తెలంగాణ లాసెట్(TS Lawcet Key) ఎగ్జామ్ కు సంబంధించిన కీ రిలీజ్ అయింది.

  • Written By:
  • Updated On - May 29, 2023 / 12:53 PM IST

మే 25న జరిగిన తెలంగాణ లాసెట్(TS Lawcet Key) ఎగ్జామ్ కు సంబంధించిన కీ రిలీజ్ అయింది. అభ్యర్థులు తమ జవాబు పత్రాలను క్రాస్ చెక్ చేసుకొని.. మే 31 వరకు అభ్యంతరాలను తెలియజేయవచ్చు. జూలైలో ఎగ్జామ్ రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత తెలంగాణలోని లా కాలేజీల్లో ప్రవేశానికి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. తాత్కాలిక సమాధానాల  కీ పేపర్ కోసం lawcet.tsche.ac.in  వెబ్ సైట్ ను చూడొచ్చు. ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ నంబర్‌, హాల్ టికెట్ నంబర్ సహా అవసరమైన లాగిన్ వివరాలను ఉపయోగించి వారి స్కోర్‌లను లెక్కించుకోవచ్చు. ఈ ఎంట్రెన్స్ ద్వారా రాష్ట్రంలోని 30కి పైగా లా కాలేజీల్లో 3 సంవత్సరాల LLB, 5 సంవత్సరాల LLB కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.

Also read  : Group I Prelims : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడంటే.. ?

ఆన్సర్ కీని(TS Lawcet Key) చెక్ చేయడం ఇలా..  

స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్‌ lawcet.tsche.ac.in ని  సందర్శించండి.

స్టెప్ 2 : హోమ్‌పేజీలో “TS LAWCET 2023 జవాబు కీ” లింక్ కోసం చూడండి.

స్టెప్ 3 : తాత్కాలిక సమాధాన కీని యాక్సెస్ చేయడానికి లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 4 : రెస్పాన్స్ షీట్‌లు, ప్రశ్నాపత్రాన్ని వీక్షించడానికి మీ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయండి.

స్టెప్ 5 : ఆన్సర్ కీతో మీ సమాధానాలను క్రాస్ చెక్ చేయండి. మీ స్కోర్‌లను లెక్కించండి.

స్టెప్ 6 : మీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని గడువు తేదీ మే 31లోపు సాయంత్రం 5 గంటల వరకు సమర్పించండి.