Assembly Winter Session : డిసెంబర్‌ 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

TS Assembly Winter Session : ముఖ్యంగా రైతు భరోసా పథకం, కులగణన వివరాలు, ప్రభుత్వ హామీల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొనే అవకాశముంది

Published By: HashtagU Telugu Desk
Ts Assembly Winter Session

Ts Assembly Winter Session

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు (TS Assembly Winter Session to Begin from December 9th) ఈ నెల 9న మొదలుకాబోతున్నాయి. ఈ సమావేశాల్లో ముఖ్యంగా రైతు భరోసా పథకం, కులగణన వివరాలు, ప్రభుత్వ హామీల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొనే అవకాశముంది. ఈ క్రమంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ (BRS) (భారత రాష్ట్రీయ సమితి) ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ, అసెంబ్లీలో గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది. ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని హైలైట్ చేయాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది.

సీఎం రేవంత్‌ రెడ్డి ఈ రోజు ఉదయం చేసిన ప్రకటనలో రైతు భరోసా అంశంపై చర్చ ఉంటుందని స్పష్టం చేశారు. కులగణన వివరాలపై కూడా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలనపై తాను సంతృప్తిగా ఉన్నానని, సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశాలు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారే అవకాశముంది, ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రజల సమస్యలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీయాలని ఉత్సాహంగా ఉన్నాయి.

రైతు భరోసా – ప్రధాన చర్చాంశం :

రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా పథకం పై ముఖ్య చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం తమ ప్రభుత్వానికి ప్రాధాన్యమని, సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పారు. ఇది ప్రతిపక్షాల విమర్శలకు సమాధానమని భావిస్తున్నారు. రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

కులగణన వివరాలు – చర్చకు రంగం సిద్ధం :

సమాజంలోని వెనుకబడిన కులాల అభివృద్ధికి సంబంధించి కులగణన వివరాలు ఎలా ఉపయోగపడతాయనే దానిపై కూడా చర్చ జరిగే అవకాశముంది. కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చు.

కాంగ్రెస్ ను బిఆర్ఎస్ దెబ్బతీసే ప్రయత్నం :

భారత రాష్ట్రీయ సమితి (బీఆర్‌ఎస్‌) ప్రతిపక్షంగా, ఈ సమావేశాల్లో తమ దూకుడును మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని, ఈ అంశాన్ని సభలో పతాక స్థాయికి తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ముఖ్యంగా వ్యవసాయ సమస్యలు, విద్యుత్ సౌకర్యాలు, రైతు రుణమాఫీ వంటి హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తోంది. చూద్దాం మరి సమావేశాల్లో ఏంజరుగుతుందో..!!

Read Also : Kishan Reddy Vs Revanth : కిషన్ రెడ్డికి తెలంగాణతో ఏం సంబంధం..? – సీఎం రేవంత్

  Last Updated: 01 Dec 2024, 08:46 PM IST