Barron Trump : రాజకీయ ప్రవేశం చేయనున్న ట్రంప్‌ చిన్న కుమారుడు

  • Written By:
  • Publish Date - May 9, 2024 / 01:07 PM IST

Barron Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌(Donald Trump) చిన్న కుమారుడు బారన్‌ ట్రంప్‌(Barron Trump) రాజకీయాలో(politics)కి రానున్నారు. ఈ మేరకు రిపబ్లికన్‌ నేషనల్‌ కన్వెన్షన్‌ కు ఫ్లోరిడా నుండి ప్రతినిధిగా పంపన్నుట్లు పార్టీ ఛైర్మన్‌ ఇవన్‌ పవర్‌ బుధవారం వెల్లడించారు. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump) పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఆయన ఎంపికను అధికారికంగా ధ్రువీకరించేందుకు జులైలో పార్టీ కన్వెన్షన్‌ జరగనుంది. దీనికి ఫ్లోరిడా నుంచి 41 మంది ప్రతినిధులు వెళ్లనున్నారు. వారిలో బ్యారన్‌ ట్రంప్‌ ఒకరని పవర్‌ వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

బ్యారన్‌ ట్రంప్‌ (Barron Trump) ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటూ వచ్చారు. మార్చిలో ఆయనకు 18 ఏళ్లు వచ్చాయి. వచ్చే వారమే హైస్కూల్‌ నుంచి గ్రాడ్యుయేట్‌ కానున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ‘హష్‌మనీ కేసు’లో ఆయన విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Read Also: Smriti Irani Vs Gandhis : ఏ ఛానలైనా, ఏ యాంకరైనా ఓకే.. గాంధీలకు స్మృతి‌ ఇరానీ సవాల్

మరోవైపు ట్రంప్‌ ఇతర వారసులైన డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌, ఎరిక్‌ ట్రంప్‌, చిన్న కుమార్తె టిఫనీ సైతం పార్టీ తరఫున ఫ్లోరిడా ప్రతినిధులుగా వ్యవహరించనున్నారు. పార్టీ కన్వెన్షన్‌ విస్కాన్సిన్‌లోని మిల్వాకీ నగరంలో జులై 15-18 మధ్య జరగనుంది.