AI Toddler : వీఐపీలు పసి పిల్లలైన వేళ.. AI చేసిన మ్యాజిక్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ.. చిత్ర్ర విచిత్రాలు చేస్తోంది.. చిత్రాలను విచిత్రంగా మార్చి చూపిస్తోంది.. పెద్దల ఫోటోలను పిల్లల్లాగా.. పిల్లల ఫోటోలను పెద్దల్లాగా కూడా చిటికెలో మార్చేస్తోంది..  ఆర్టిస్ట్ అంటేనే క్రియేటివిటీకి కేరాఫ్.. జ్యో జాన్ ముల్లూర్ అనే ఆర్టిస్ట్ క్రియేటివ్ గా ఆలోచించాడు.. 

  • Written By:
  • Updated On - June 10, 2023 / 01:41 PM IST

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ.. చిత్ర్ర విచిత్రాలు చేస్తోంది.. 

చిత్రాలను విచిత్రంగా మార్చి చూపిస్తోంది..

పెద్దల ఫోటోలను పిల్లల్లాగా.. పిల్లల ఫోటోలను పెద్దల్లాగా కూడా చిటికెలో మార్చేస్తోంది.. 

ఆర్టిస్ట్ అంటేనే క్రియేటివిటీకి కేరాఫ్.. 

జ్యో జాన్ ముల్లూర్ అనే ఆర్టిస్ట్ క్రియేటివ్ గా ఆలోచించాడు.. 

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తుల ఫోటోలను బాల్యంలోకి(AI Toddler) కన్వర్ట్ చేశాడు. 

ట్రంప్, ఒబామా, ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీ, నరేంద్ర మోడీ, సుందర్ పిచాయ్, మార్క్ జుకర్‌బర్గ్, జాక్ మా, రిచర్డ్ బ్రాన్సన్, జెఫ్ బెజోస్, స్టీవ్ జాబ్స్, వారెన్ బఫెట్‌, వ్లాదిమిర్ పుతిన్, బిల్ గేట్స్, కిమ్ జోంగ్ ఉన్, రిహన్న, జో బైడెన్, ఓప్రా విన్‌ఫ్రే, సెర్గీ బ్రిన్‌.. వీరంతా ప్రపంచంలో ప్రముఖ వ్యక్తులు. ఇలాంటి ప్రముఖుల ఫోటోలు చైల్డ్ లుక్ లోకి మారాయి. వివిధ రంగాల ఈ దిగ్గజాలు పిల్లల లుక్ లో స్మార్ట్ గా కనిపించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఇది సాధ్యమైంది.

 

Also read : 12000 Year Old Flutes : 12వేల ఏళ్ల కిందటి ఫ్లూట్.. విశేషాలివీ

 

ఆర్టిస్ట్ జ్యో జాన్ ముల్లూర్ ఈవిధంగా తాను మార్చిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.  మిడ్‌ జర్నీ(Mid journey) అనే AI అప్లికేషన్‌ను ఉపయోగించి తాను ఈ ఫోటోలను రూపొందించినట్లు జ్యో జాన్ ముల్లూర్ వెల్లడించారు. ఆ వీఐపీ లు చైల్డ్ లుక్ లో(AI Toddler) ఎంత క్యూట్ గా ఉన్నారో అంటూ నెటిజన్స్ చిలిపి కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి ఫోటోస్ చూపించినందుకు ఆర్టిస్ట్ జ్యో జాన్ ముల్లూర్ కు థాంక్స్ చెబుతున్నారు. మరికొందరు ఈ ఆర్ట్‌ వర్క్ పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు.