Site icon HashtagU Telugu

YouTuber : ప్రముఖ యూట్యూబర్‌ పై దారుణంగా ట్రోల్స్..!

YouTuber Armaan Malik

Youtuber

ప్రముఖ యూట్యూబర్ (YouTuber), కంటెంట్ క్రియేటర్ (Content Creator) అయిన అర్మాన్ మాలిక్‌ (Armaan Malik) ను నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ (Trolls) చేశారు. ఇటీవల ఇన్‌స్టా (Instagram) లో ఇద్దరు భార్యలతో దిగిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. తన భార్యలిద్దరూ బేబీ బంప్‌ తో ఉండగా, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మాలిక్‌ ట్రోల్స్‌కు గురయ్యారు యూట్యూబర్ (YouTuber) ఆర్మాన్ మాలిక్‌ (Armaan Malik) ఇద్దరు భార్యలు కృతిక, పాయల్‌ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నారు.

ఈ ఫోటోలను మాలిక్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాయల్‌ కంటే కృతికతో ఉన్న ఫోటోలు ఎక్కువ పోస్ట్ చేశాడని పలువురు మండిపడ్డారు. మీరు కృతికపై మాత్రమే ఎందుకు ఎక్కువ ప్రేమ చూపుతున్నారని మరికొందరు ప్రశ్నించారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఇలాంటి తెలివి తక్కువ వ్యక్తులకు ప్రజలు ఎలా మద్దతు ఇస్తారని మండిపడ్డారు. కొంతమంది మాత్రం అందరికీ భిన్నంగా వీరికి అభినందనలు తెలిపారు.

Also Read:  Christmas Bonus : క్రిస్మస్‌ బోనస్‌ గా ఉద్యోగులకు ₹80 లక్షలు..!