ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా తాజాగా ట్వీట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుజరాత్‌లోని ఓ గ్రామంలో సింహం రోడ్డు దాటుతుండగా, అదే రోడ్డు పై ఓ జంట బైక్‌పై వెళుతూ సింహాన్ని చూసి ఆగారు. దీంతో సింహం వారి పై నడుచుకుంటూ వస్తున్న వీడియో చూస్తుంటేనే గుండె ఝల్లుమనేలా ఉంది.. మరి సింహాం వారి వైపు సమీపిస్తున్న తరుణంలో బైక్ పై ఆ జంట పరిస్థితి గురించి వర్ణించడం కూడా చాలా కష్టం.
అయితే ఆ సింహా వేటాడే మూడ్‌లో లేనట్టుంది.. బైక్‌పై ఉన్న జంట సమీపానికి వచ్చింది కానీ వారి పై దాడి చేయకుండా రోడ్డు దాటి అడవిలోకి వెళ్ళిపోయింది. ఇక సింహం వాళ్ళ దగ్గరకు వస్తున్నా, బైక్ పై వెనుక కూర్చున్న మహిళ, గుండె ఆగిపోయే క్షణాన్ని వీడియో తీయడం, ఆ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో , ఇప్పటి వరకు 48,000 మందికి పైగానే వీక్షించారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Co travellers on a Village road. Happens in India😊 pic.twitter.com/XQKtOcEstF
— Susanta Nanda (@susantananda3) February 14, 2022

