Totapuri Mangoes: ఆహా ఏమి రుచి.. తినరా ‘తోతాపురి’

గత కొన్ని రోజులుగా తోతాపురి మామిడి పండ్లకు డిమాండ్ పెరిగింది.

  • Written By:
  • Updated On - June 25, 2022 / 12:51 PM IST

గత కొన్ని రోజులుగా తోతాపురి మామిడి పండ్లకు డిమాండ్ పెరిగింది. కర్ణాటకలోని మైసూరు, తుమ్ముకూరు, మహారాష్ట్ర, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చెందిన వ్యాపారులు చిత్తూరు జిల్లాలోని మండీలలో (మార్కెట్లు) వేలంలో పాల్గొని అక్కడి మార్కెట్ కు తరలిస్తున్నారు. వ్యాపారులు టన్ను రూ.25,000-రూ.28,000 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ సీజన్‌లో అత్యధికంగా మామిడి పండ్లు చేతికొచ్చాయి. మామిడి రకాలకు ప్రసిద్ధి చెందిన చిత్తూరు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కొనుగోలుదారులకు అడ్డాగా మారింది. 50కి పైగా మామిడి ఫ్యాక్టరీలు స్థానికంగా ఉత్పత్తి చేసే తోతాపురిపై ఆధారపడి తమ తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నాయి.

ఏపీలోని దామలచెరువు, తిరుపతి, బంగారుపాళ్యం, పుత్తూరులోని మామిడి మార్కెట్‌లకు మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్‌ నుంచి వ్యాపారులు వస్తుంటారు. “సాధారణంగా, ఇతర రాష్ట్రాలకు మామిడి సరఫరా ఏప్రిల్ చివరి నాటికి ప్రారంభమవుతుంది. జూలై వరకు కొనసాగుతుంది. ఈ రకం సాధారణంగా బంగారుపాళ్యం మామిడి మండిలో మంచి ధరను పొందుతుంది. ఇక్కడ నుండి తమిళనాడు, కర్ణాటకలకు పండ్లు సరఫరా అవుతున్నాయి. జిల్లాలో అకాల వర్షాలు, నేల పరిస్థితులు అనుకూలించకపోవడంతో మామిడి కాయలు తెంపడంలో జాప్యం జరిగింది. ఈ కారణాలతో జిల్లాలో కేవలం 60 శాతం మామిడి దిగుబడిని మాత్రమే రైతులు మండీలకు తరలిస్తున్నారు. “కొంతమంది వ్యాపారులు, ఇతర వాటాదారులు మామిడి ధరల పెరుగుదలను ఆపడానికి పన్నాగం పన్నారు. అయితే, ఇతర రాష్ట్రాల నుంచి విపరీతమైన డిమాండ్‌తో జిల్లాలో తోతాపురికి  ధర పెరిగింది’ అని మరో రైతు ఎస్‌.రమణ తెలిపారు.