27 in Auto: అయ్య బాబోయ్..ఒకే ఆటోలో 27 మంది ప్రయాణికులా?

సాధారణంగా మనం చుట్టుపక్కల చిన్న ఆటోలను లేదా పెద్ద ఆటోలను చూస్తూ ఉంటాము.

  • Written By:
  • Publish Date - July 12, 2022 / 07:15 AM IST

సాధారణంగా మనం చుట్టుపక్కల చిన్న ఆటోలను లేదా పెద్ద ఆటోలను చూస్తూ ఉంటాము. అయితే ఆ ఆటో సైజు ని బట్టి అందులో ప్యాసింజర్లను ఎక్కించుకుంటూ ఉంటారు ఆటో డ్రైవర్లు. అయితే కొన్ని కొన్ని సార్లు కొంతమంది ఎక్కువ డబ్బులు కావాలి అన్న ఉద్దేశంతో పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను ఎక్కిస్తూ ఉంటారు. ఉదాహరణకు పల్లెల్లో పనులకు వెళ్లే కూలీల ఆటోలు. ఈ కూలీలు పల్లెల కోసం ఆటోలలో ఒక్కొక్కసారి పరిమితికి మించి మరీ ఆటోలో ఎక్కి ప్రయాణిస్తూ ఉంటారు. సాధారణంగా చిన్న ఆటోలలో 6 లేదా 5 మంది పడతారు.

ఇక పెద్ద ఆటోలో అయితే 12 మంది లేదా పదిమంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు 16 మంది కూడా ప్రయాణిస్తూ ఉంటారు. కానీ తాజాగా ఒక ఆటో డ్రైవర్ మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఒక ఆటోలో 27 మందిని ఎక్కించుకొన్నాడు. ఆ ఆటో తోలుతున్న వ్యక్తి పోలీసుల కంటపడటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్ లో ఒక ఆటో డ్రైవర్ మొత్తం 27 మంది ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకున్నాడు.సమీపంలోని ఫతేపూర్ వీధుల్లో స్పీడుగా వెళ్తున్నాడు.

ఆటో బిందికి కొత్వాల్ ప్రాంతానికి రాగానే అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఆటోని ఆపాడు. ఆటోలో చాలామంది ఉన్నారని గుర్తించిన కానిస్టేబుల్ ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్లని ఒక్కొక్కరిని కిందికి దిగమంటూ లెక్కబెట్టడం ప్రారంభించాడు. లెక్కబెట్టటం పూర్తి చేసిన కానిస్టేబుల్ ఆటోలో మొత్తం 27 మంది ఉండటంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అనంతరం రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆటో డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటోను సీజ్ చేశారు.