Site icon HashtagU Telugu

Blood Moon: పలుదేశాల్లో బ్లడ్ మూన్ దర్శనం.. నాసా వెబ్ సైట్, ట్విటర్ ఖాతాలో మీరూ చూడండి!!

Blood Moon

Blood Moon

బ్లడ్ మూన్ సోమవారం కొన్ని దేశాల్లో దర్శనమిచ్చింది. చంద్రగ్రహణం సమయంలో నిండు చంద్రుడు ఎర్రగా కనిపించాడు. ఇది కనిపించిన నగరాల జాబితాలో రోమ్, బ్రస్సెల్స్, లండన్, ప్యారిస్, హవానా, జోహేన్స్ బర్గ్, లాగోస్, మ్యాడ్రిడ్, శాంటియాగో, న్యూయార్క్, వాషింగ్టన్, గ్వాటెమాలా, రియో డీ జెనీరో, చికాగో ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని దేశాల నగరాల్లోనూ బ్లడ్ మూన్ ను ప్రజలు పాక్షికంగా చూడగలిగారు. భారత్ లో ఇది ఎక్కడ కూడా కనిపించలేదు. 1989 ఆగస్టులో బ్లడ్ మూన్ 96 నిమిషాల పాటు సంభవించగా.. ఈసారి అది 85 నిమిషాలు కొనసాగింది. మరో సంపూర్ణ చంద్రగ్రహణం ఈఏడాది నవంబర్ లో సంభవించనుంది. అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఈ ఏడాది తొలి చంద్రగ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ వీడియోను నాసా అధికారిక వెబ్ సైట్, ట్విటర్ ఖాతాలో చూడొచ్చు.

చంద్రునికి, సూర్యునికి మధ్యగా భూమి..

శాస్త్రీయంగా గ్రహణం అనేది ఖగోళ సంఘటన. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. చంద్రునికి, సూర్యునికి మధ్యగా భూమి వచ్చి.. ఆ నీడ చంద్రుడిపై పడినప్పుడు చంద్ర గ్రహణం అంటారు. చంద్రగ్రహణం పౌర్ణమి నాడు సంభవిస్తుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం.