Site icon HashtagU Telugu

Kcr Maharashtra : నేడు నాందేడ్‌కు కేసీఆర్..1000 మందితో కీలక సమావేశం

TS Cabinet

New Web Story Copy 2023 05 18t202205.616

మహారాష్ట్రపై బీఆర్ఎస్ అధినేత,  సీఎం కేసీఆర్ (Kcr Maharashtra) స్పెషల్ ఫోకస్ పెట్టారు. అక్కడ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు, రేపు (మే 19, 20 తేదీల్లో) నాందేడ్ వేదికగా మహారాష్ట్రలోని బీఆర్ఎస్ శ్రేణులకు(Kcr Maharashtra) శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఇవాళ ఈ ప్రోగ్రాం ను కేసీఆర్ స్వయంగా స్టార్ట్ చేయనున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ మొదటి కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఈ శిక్షణ తరగతులకు మహారాష్ట్రలోని  ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు చొప్పున ప్రతినిధులను ఎంపిక చేశారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 864 మంది హాజరుకానున్నారు. వీరితో పాటు మరో వందమంది ముఖ్య నేతలు మొత్తం సుమారు వెయ్యిమంది అటెండ్ అవుతున్నట్లు సమాచారం. రాష్ట్ర సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, పార్టీ సీనియర్‌ నేత రవీందర్‌సింగ్‌ ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

also read : KCR Strategy : తెలంగాణ మోడ‌ల్ కు కేసీఆర్ AP ఎత్తుగ‌డ

మే 22 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు

మహారాష్ట్రలో ఈనెల 22 నుంచి పార్టీ సభ్యత్వ నమోదును బీఆర్ఎస్  ముమ్మరం చేయనుంది. సాధారణ సభ్యత్వం, క్రియాశీలక సభ్యత్వం చేయించాలని పార్టీ నేతలకు ఆయన ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి పార్టీ సభ్యత్వాన్ని అధికంగా చేయాలని, అందుకు టార్గెట్లు కూడా పెట్టారు. జూన్ 22 వరకు నెల పాటు సభ్యత్వ నమోదును ముమ్మరం చేయనున్నారు. మరోవైపు అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెలాఖరులోగా  ఔరంగాబాద్‌లోబీఆర్ఎస్ కార్యాలయానికి కేసీఆర్ భూమిపూజ చేయనున్నట్లు తెలుస్తోంది.