Site icon HashtagU Telugu

Raksha Bandhan : నేడు రాఖీ పౌర్ణమి..ఈ సమయంలోనే రాఖీ కట్టాలి

Raksha Bandhan

Raksha Bandhan

ఈరోజు శ్రావణ పౌర్ణమి. ఇది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ శుభదినాన దేశవ్యాప్తంగా రాఖీ పండుగ(Raksha Bandhan)ను ఘనంగా జరుపుకుంటారు. సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగకు ప్రజలు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి, తన ప్రేమను చాటుతుంది. సోదరుడు తన సోదరిని జీవితాంతం కాపాడతానని మాటిస్తాడు. ఈ పండుగ కుటుంబ బంధాలను, ప్రేమను మరింత బలపరుస్తుంది. ఈరోజు ఉదయం 5:56 నుండి మధ్యాహ్నం 1:24 గంటల వరకు రాఖీ కట్టడానికి శుభ సమయమని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో రాఖీ కట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

రాఖీ పౌర్ణమి రోజున ఉదయాన్నే తల స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత దీపం వెలిగించి, పూజ గదిలో ఒక పళ్లెంలో రాఖీలు, వెండి నాణెం, అక్షింతలు, కుంకుమ, పసుపు, మిఠాయిలు ఉంచి పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. పూజ అనంతరం అక్కాచెల్లెళ్లు తమ సోదరుడికి రాఖీ కట్టి, అతని నుదుటిపై తిలకం దిద్ది, హారతి ఇచ్చి, అక్షింతలు వేయాలి. సోదరుడి దీర్ఘాయువు కోసం, మంచి ఆరోగ్యం కోసం దేవుడిని ప్రార్థించాలి.

Modi-Putin : పుతిన్ కు ప్రధాని మోదీ ఫోన్… భారత్ కు రావాలని ఆహ్వానం

రాఖీ కట్టిన తర్వాత, సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు లేదా కానుకలు ఇవ్వడం సంప్రదాయం. బహుమతులు ఇవ్వడం ద్వారా సోదరీమణుల పట్ల తమ ప్రేమను, గౌరవాన్ని వ్యక్తపరుస్తారు. ఈ కానుకలు కేవలం వస్తువుల రూపంలో మాత్రమే కాకుండా, సోదరిని జీవితాంతం రక్షించే సంకల్పంగా కూడా భావించాలి. ఈ పండుగ సోదర సోదరీమణుల మధ్య ఉన్న బంధాన్ని మరింత దృఢపరుస్తుంది.

రాఖీ పౌర్ణమి పండుగ కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఇది ప్రేమ, ఆప్యాయత, రక్షణ, బంధాల విలువను తెలియజేస్తుంది. ఈ పండుగ సోదరీ సోదరుల మధ్య ఉన్న బంధాన్ని, వారి ప్రేమను గుర్తు చేస్తుంది. సమాజంలో కుటుంబ బంధాల ప్రాముఖ్యతను ఈ పండుగ చాటి చెబుతుంది. ఈరోజున సోదరులు తమ సోదరీమణులకు అండగా ఉంటామని, జీవితంలో అన్ని కష్టసుఖాల్లో వారికి తోడుంటామని మాటివ్వాలి. ఈ పండుగను ఆనందంగా జరుపుకుని, అందరిలో ప్రేమ, ఆప్యాయతలను పెంపొందించుకోవాలి.