Tulsidas Jayanti 2023 : భార్య మాటలతో మహాకవి తులసీదాస్ లైఫ్ లో కీలక మలుపు..

Tulsidas Jayanti 2023 :  రామచరిత మానస్‌, హనుమాన్ చాలీసా రచించిన తులసీదాస్ జయంతి ఈరోజే (ఆగస్టు 23). తులసీదాసును వాల్మీకి అవతారమని అంటారు.

Published By: HashtagU Telugu Desk
Hanuman Tulasidas

Hanuman Tulasidas

Tulsidas Jayanti 2023 :  రామచరిత మానస్‌, హనుమాన్ చాలీసా రచించిన తులసీదాస్ జయంతి ఈరోజే (ఆగస్టు 23). తులసీదాసును వాల్మీకి అవతారమని అంటారు. తులసీదాసు తన జీవిత కాలంలో సంస్కృతంతో పాటుగా హిందీలో 22 రచనలు చేశాడు. తులసీదాసు ఇతర రచనల్లో దోహావళి, కవితావళి, గీతావళి, వినయ పీఠిక, జానకీ మంగళ్‌, రామలాల నహచాచు, రామాంజ ప్రసన్న, పార్వతి మంగళ్‌, కృష్ణ గీతావళి, హనుమాన్ బాహుక, సంకట మోచనస వైరాగ్య సందీపిని, హనుమాన్‌ చాలీసా వంటివి ఉన్నాయి. అయితే రామచరితమానస్ ఆయ‌న పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది.

Also read : Chandrayaan 3 : విక్రమ్ ల్యాండర్‌ గా మారిన స్విగ్గీ డెలివరీ ఐకాన్..

భార్య మాటలే తారక మంత్రమయ్యాయి

మహాకవి తులసీదాస్ తన జీవితమంతా రామ భక్తుడిగానే(Tulsidas Jayanti 2023) గడిపాడు. తన భార్య రత్నావళి అంటే తుల‌సీదాసు ఎంతో ప్రేమ చూపించేవారు. ఒకసారి తుల‌సీదాసు ఇంట్లో లేనప్పుడు ఆయ‌న భార్య‌ రత్నావళి పుట్టింటికి వెళ్లింది. ఈ విష‌యం తెలియగానే తులసీదాసు ఆమెను కలుసుకునేందుకు బయలు దేరాడు. చిమ్మ చీకటి, దానికితోడు కుంభవృష్టి పడుతూ ఉంది. అటువంటి సమయంలో గంగానదిని దాటి భార్య ఇంటికి చేరుకొన్నాడు. అప్పుడు అతని భార్య రత్నావళి చేసిన హెచ్చరిక ఆయన జీవితాన్నే మార్చేసింది. “ఎముకలు, చర్మంతో కూడిన ఈ దేహంపై ఉన్నంత ప్రేమ..  ఆ శ్రీరాముని మీద ఉంటే భవభీతియే ఉండదు కాదా” అన్న రత్నావళి మాటలే తులసీదాసుకు తారక మంత్రమయ్యాయి.

శ్రీరామచంద్రుని భక్తిలో.. 

భార్య మాట‌ల‌తో ప‌రివ‌ర్త‌న చెందిన‌ తులసీదాసు వైరాగిగా మారి శ్రీరామచంద్రుని భక్తిలో నిమగ్నుడ‌య్యాడు. తుల‌సీదాసు ఎన్నో ఆంజనేయ స్వామి ఆలయాలు స్థాపించాడు. వారణాసిలోని సంకటమోచన్‌ దేవాలయాన్ని ఆయ‌నే కట్టించాడు. త‌న‌కు రాముని దర్శన భాగ్యం కల్పించిన హనుమంతునికి కృతజ్ఞతగా ఈ ఆల‌యాన్ని కట్టించాడని ప్రతీతి. తులసీదాసు ప‌ర‌మేశ్వ‌రుడిని, ఆంజనేయ స్వామిని ప్రత్యక్షంగా చూసినట్లు చెబుతారు. రామచరిత మానస్‌ రచనలో తులసీదాసుకు ఆంజనేయ స్వామి చాలా సహాయం చేశాడని చెప్పుకొంటారు.

  Last Updated: 23 Aug 2023, 03:23 PM IST