Site icon HashtagU Telugu

WWE – Hyderabad : హైదరాబాద్ లో డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్.. గంటల్లోనే టికెట్స్ ఖాళీ

Wwe Hyderabad

Wwe Hyderabad

WWE – Hyderabad :  “వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్”.. అదేనండీ “డబ్ల్యూడబ్ల్యూఈ” (WWE) పోటీలకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్నారు. అలాంటి “WWE”  మెగా ఈవెంట్ కు మన  హైదరాబాద్  సెప్టెంబర్ 8న ఆతిథ్యం ఇవ్వబోతోంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో “WWE సూపర్‌స్టార్ స్పెక్టాకిల్” లైవ్  ఈవెంట్‌ను తొలిసారిగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన టికెట్లను “బుక్ మై షో” ద్వారా సేల్ చేయగా.. ఒక్క రోజులోనే అన్నీ అమ్ముడుపోయాయి.

రూ.12,000, రూ.15,000  ధరల టికెట్లన్నీ అయిపోగా.. రూ.5,000, రూ.7,500 టికెట్ కేటగిరీల్లో బుకింగ్ లు(WWE-Hyderabad) దాదాపు పూర్తి కావచ్చాయి. రియా రిప్లే, సమీ జ్యాయన్, సేథ్ ‘ఫ్రీకిన్’ రోలిన్స్, కెవిన్ ఓవెన్స్‌ తదితర రెజ్లింగ్ స్టార్లు రాబోతున్న ఈ కార్యక్రమాన్ని “బుక్ మై షో”  స్పాన్సర్ చేస్తోంది. WWE సూపర్‌స్టార్లు జిందర్ మహల్, వీర్, సంగ కూడా ఇందులో పోటీపడనున్నారు.