Site icon HashtagU Telugu

Viral Video: తల్లిపై కేసు పెట్టిన మూడేళ్ల బుడొడ్డు.. చక్కర్లు కొడుతున్న వీడియో!

Viral

Viral

మూడేళ్ల చిన్నారి తన తల్లిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  తన చాక్లెట్స్ ను దొంగిలించినందుకు తన తల్లిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లమని, తండ్రిని ప్రతిరోజు బలవంతం చేయడంతో బాలుడి తండ్రి తన కొడుకుతో పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు తెలిసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బర్హంపూర్‌లో చోటుచేసుకుంది. తల్లి  తన చెంపను కొట్టిందని, బాలుడు ఒక కాగితంపై సంతకం చేశాడు. దీంతో మహిళా పోలీసు అధికారి తన ఫిర్యాదును నమోదు చేసినట్లు నటించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.