Boys and Python: కుక్క పిల్ల కోసం కొండచిలువతో పోరాడిన ముగ్గురు చిన్నారులు.. వీడియో వైరల్!

సోషల్ మీడియాలో తరచూ కొన్ని రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని నవ్వులు తెప్పించేవి కాగా మరికొన్ని ఔరా అనిపించేవి కూడా ఉంటాయి.

  • Written By:
  • Publish Date - August 9, 2022 / 07:45 AM IST

సోషల్ మీడియాలో తరచూ కొన్ని రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని నవ్వులు తెప్పించేవి కాగా మరికొన్ని ఔరా అనిపించేవి కూడా ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల టాలెంట్ కు సంబంధించిన వీడియోలు, జంతువులు పక్షులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే సంఘటన కూడా అలాంటిదే. అయితే మామూలుగా ఏ విధంగా వయసు ఉన్న పిల్లలను చూసిన వారు చేసే అల్లరి నుంచి వేసిన ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ ముగ్గురులు బలం చూస్తే మాత్రం గ్రేట్ అనాల్సిందే. ఎందుకంటే ముగ్గురు చిన్నారులు ఏకంగా పెద్ద కొండచిలువతో పోరాడారు. అది కూడా ఒక కుక్క కోసం.

తాజాగా చైనాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక కొండ చిలువ కుక్కను పట్టేసుకుంది. ఆ కొండచిలువ కుక్కను చుట్టేసి తినేసేందుకు సిద్ధంగా అయ్యింది. అయితే ఇంతలో ఆ కుక్కను పెంచుకునే ముగ్గురు చిన్నారులు అక్కడికి వచ్చి, ఆ కుక్కను రక్షించాలని అనుకున్నారు. అందుకోసం వెంటనే చుట్టుపక్కల కనిపించిన చిన్న కర్రలు, రాళ్లు పట్టుకుని కొండ చిలువను కొట్టడం మొదలుపెట్టారు. దీంతో కుక్కను పట్టేసుకుని కూడా ఆ కొండ చిలువ ఆ పిల్లల వైపు దూకుతున్నట్టుగా చేస్తూ భయపెట్టినా కూడా ఆ పిల్లలు వెనక్కి తగ్గకుందా ఆ కుక్కను కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ ముగ్గురిలో ఒక బాలుడు కర్రతో కొండ చిలువ తల పై గట్టిగా పెట్టి ఒత్తి పట్టుకున్నాడు.

వెంటనే మిగతా ఇద్దరు వచ్చి కొండ చిలువ పట్టు నుంచి కుక్కను విడదీయడం మొదలుపెట్టారు. అలా మొదటి పిల్లాడు తల భాగం గట్టిగా పట్టుకుని ఓ వైపు లాగగా మరొకరు తోక భాగం పట్టుకుని లాగుతూ, మరొకరు మధ్య భాగం నుంచి విడదీసేందుకు ప్రయత్నించారు. అలా ఆ ముగ్గురు పిల్లలు గట్టిగానే ప్రయత్నించి మొత్తానికి ఆ కొండచిలువ నుంచి నుంచి కుక్క పిల్లను కాపాడారు. అయితే కొండచిలువను చూస్తే పెద్దవాళ్లే భయంతో పరుగులు తీస్తూ ఉంటారు. కానీ ఆ చిన్నారులు ఆ కొండచిలువను చూసి ఏమాత్రం భయపడకుండా ధైర్యంతో ముగ్గురు కలగలసి ఆ కుక్కను కాపాడారు. ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ ఆ ముగ్గురు పిల్లల ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. ఇక ఆ వీడియోలో ఉన్న చిన్నారులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.