Site icon HashtagU Telugu

Guests Pay for wedding entry:ఆ మోడల్ పెళ్లికి వెళ్లే ప్రతి ఒక్కరు 10 వేలు చెల్లించాలట.. కారణం ఇదే!

Carla Bellucci

Carla Bellucci

సాధారణంగా మనం ఏదైనా పెళ్లిళ్లకు లేదా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు అక్కడ డబ్బులను రాస్తూ ఉంటాం లేదంటే గిఫ్ట్ లు ఇస్తూ ఉంటాం. కానీ ఒక మోడల్ మాత్రం తన పెళ్లికి వచ్చే ప్రతి ఒక్కరూ కచ్చితంగా 10,000 రూపాయలు చెల్లించాల్సిందే అని కండిషన్ను పెట్టిందట. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటన్ కు చెందిన కార్లా బెల్లూస్సీకీ ఇంతకుముందే పెళ్లయి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అతనితో బంధం ముగియడంతో మరొకసారి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. కాగా ప్రస్తుతం ఆమె వయసు 40 ఏళ్లు. అంతే కాకుండా బ్రిటన్ లో ఎక్కువ మంది అసహ్యించుకునే మహిళగా కూడా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. 40 ఏళ్ల కార్లా బెల్లూస్సీ, 52 ఏళ్ల జియోవాన్నీతో పెళ్లిని అత్యంత గ్రాండ్‌గా జరుపుకోవాలి అనుకుంటుందట.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ మోడల్ పెళ్లి కీ వచ్చే అతిథులంతా తప్పకుండా రూ.10 వేల చొప్పున చదివించుకోవాలని కండీషన్ పెట్టింది. అయితే పెళ్లి జరిగిన తర్వాత వధువు వరుడు కుటుంబాలకు బోలెడన్ని ఖర్చులు అవుతాయి. అయితే ఇది కార్లా బెల్లూస్సీ ఇష్టం లేకపోవడంతో తన పెళ్లికి వచ్చిన అందరూ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఖర్చుల భారం కూడా అందరికీ పడాలి అనే ఆమె భావించే, కేవలం 30 మందిని మాత్రమే పెళ్లికి పిలవాలి అనుకుంటోందట. వారు ఒక్కొక్కరూ రూ.10,000 చొప్పున చెల్లిస్తే అలా మొత్తం రూ.3,00,000 వస్తుందని భావిస్తోంది. అయితే ఆమె తన పెళ్లి కోసం రూ.40 లక్షలు ఖర్చు చేస్తోందట.కేప్ వెర్డేలో జరిగే తన పెళ్లికి వచ్చే వారి కోసం విమాన సర్వీసులు, అకామడేషన్ వంటి ఖర్చుల కోసం మరో రూ.2,00,000 ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది.

కాగా ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏమిటంటే ఆమె షరతు మేరకు పెళ్లికి ఒప్పుకున్న అతిధులు డబ్బు చెల్లించేందుకు కూడా ఒప్పుకున్నారట. ఆ విషయంలో జాగ్రత్తపడతాను వారంతా డబ్బు ఇచ్చేలా చూసుకుంటాను కార్లా బెల్లూస్సీ తెలిపింది. అడల్ట్ మోడలైన కార్లా ఓన్లీఫ్యాన్స్ సైట్‌ ద్వారా నెలకు రూ.5లక్షల దాకా సంపాదిస్తోంది. తన పెళ్లి కోసం ఫైవ్ స్టార్ హిల్టన్ హోటల్‌ని బుక్ చేసింది. పెళ్లి తర్వాత బీచ్ సెరెమనీలో షాంపెయిన్ ఇచ్చి అక్కడే డిన్నర్ చేసేలా ప్లాన్ చేసింది. కాగా ఆమె 19 ఏళ్ల వయసులో మొదటి పెళ్లి చేసుకుందట. అప్పట్లో తన మొదటి పెళ్లి సరిగా జరగకపోవడంతో ఇప్పుడు రెండో పెళ్లిని గ్రాండ్‌గా చేసుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. కార్లా బెల్లూస్సీ ఎంగేజ్‌మెంట్ రింగ్ ధర రూ.6 లక్షలు కాగా వెడ్డింగ్ డ్రెస్ ధర కూడా రూ.6 లక్షలు. అన్ని బాగానే ఉన్నప్పటికీ ఆమె బలవంతంగా మనీ వసూలు చేసేలా తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.

Exit mobile version