Site icon HashtagU Telugu

Winning Hearts : ఐ డోన్ట్ వాన్ట్ బెగ్.. ప్లీజ్ బై పెన్స్!

Ratan

Ratan

ఆమె వయసు దాదాపు డెబ్బైఏళ్లు ఉంటాయి. కానీ ఈ వయసులోనూ ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా జీవనోపాధి పొందుతోంది. ఆమె పేరు రతన్. పూణేలోని MG రోడ్‌లోని కాలిబాటలపై పెన్నులు విక్రయిస్తోంది. ఆమె ప్రత్యేకమైన మరియు శక్తివంతమైనది ఏమిటంటే, ఆమె భిక్షాటన చేయడానికి బదులుగా తన జీవనోపాధిని ఎంచుకుంటుంది. పెన్నులు ఒక కార్డ్ బాక్స్ లో ఉంచి, దానిపై ఒక నిర్దిష్టమైన నోట్ రాసి ఉంది. “నాకు అడుక్కోవడం ఇష్టం లేదు. దయచేసి రూ.10/-లకు నీలిరంగు పెన్నులు కొనండి. చాలా ధన్యవాదాలు. దేవుడు నిన్ను దీవించుగాక.” అని వేడుకుంటోంది.

తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో పేర్కొన్నట్లుగా, శిఖా రాఠి తన స్నేహితుడితో కలిసి డ్రైవ్‌లో ఉన్నప్పుడు రతన్‌ను అనుకోకుండా కలుసుకున్నారు. “మేము రతన్‌ను కలిసినప్పుడు నాతో స్నేహితుడి ఉన్నారు. అతడు వెంటనే ఓ పెన్నును కొనుగోలు చేసాడు. రతన్ చాలా సంతోషించింది. ఆమె కళ్లలో కృతజ్ఞతభావం కనిపించింది. ఆమె మాకు కృతజ్ఞతలు తెలిపింది. ఆమె చిత్తశుద్ధితో పాటు ఆమె మధురమైన చిరునవ్వు, దయగల హృదయం నన్ను ఆమె నుండి మరిన్ని పెన్నులు కొనుగోలు చేసేలా చేసింది’’ ట్వీట్ చేశారు.