Site icon HashtagU Telugu

Spoon Man: శ‌రీరంపై 85 స్పూన్‌లు బ్యాలెన్స్ చేసిన వ్య‌క్తి

spoon man

spoon man

మీ చేతులు ఉపయోగించకుండా మీ శరీరంపై ఏదైనా పట్టుకోగలరా అది సాధ్య‌మ‌వుతుందా.. చాలామందికి సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. కాని ఓ వ్య‌క్తి మాత్రం త‌న శ‌రీరంపై ఏకంగా 85 స్పూన్ల‌ను బ్యాలెన్స్ చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు. ఇంత‌కీ ఆ వ్య‌క్తి ఎవ‌రో వివ‌రాల్లోకి వెళ్దాం..

ఇరాన్‌కు చెందిన 50 ఏళ్ల అబోల్‌ఫజల్ సాబెర్ మొఖ్తారీ తన శరీరంపై 85 స్పూన్‌ల‌ను బ్యాలెన్స్ చేశాడు.
శ‌రీరంపై అత్యధిక స్పూన్లు బ్యాలెన్స్ చేసిన రికార్డు స్పెయిన్‌కు చెందిన మార్కోస్ రూయిజ్ సెబల్లోస్ పేరిట ఉంది. అయితే ఆ రికార్డును బ‌ద్ద‌లు కొట్టేందుకు మొఖ్తారీ ప్ర‌య‌త్నిస్తున్నాడు. మొఖ్తారీ 80వ స్పూన్‌కి చేరుకున్నప్పుడు తేమ, వేడి వాతావరణం కారణంగా త‌న‌ శరీరం నుండి కొన్ని స్పూన్లు జారిపోయాయని అబోల్ ఫ‌జ‌ల్ సాబెల్ మొఖ్తారీ తెలిపాడు. ప్రపంచం మొత్తం త‌న ప్రతిభను చూడాలని కోరుకుంటున్నానని..తాను ఇతర దేశాలకు వెళ్లి త‌న‌ బహుమతిని ప్రదర్శించాలనుకుంటున్నాని తెలిపాడు.

ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను బద్దలు కొట్టడం ద్వారా తాను ఆ లక్ష్యానికి గతంలో కంటే దగ్గరగా ఉన్నానని తెల‌పాడు. తాను ప్రస్తుతం చాలా సంతోషంగా, గర్వంగా భావిస్తున్నాన‌ని తెల‌పాడు.