Kashmir Kid Viral Interview : టచ్ చేద్దామంటే కశ్మీర్లో మంచు లేదు.. బాధగా ఉంది – బాలిక ఇంటర్వ్యూ వీడియో వైరల్

కశ్మీర్ ను భూలోక స్వర్గం అంటారు. దాన్ని చూసేందుకు రెండు కళ్ళూ చాలవు. రెండు కళ్ళూ లేని ఓ పాప.. కశ్మీర్ కు వస్తే ఏం కోరుకుంటుంది ?

Published By: HashtagU Telugu Desk
Kashmir Girl

Kashmir Girl

కశ్మీర్ ను భూలోక స్వర్గం అంటారు. దాన్ని చూసేందుకు రెండు కళ్ళూ చాలవు. రెండు కళ్ళూ లేని ఓ పాప.. కశ్మీర్ కు వస్తే ఏం కోరుకుంటుంది ? మంచు దుప్పటి తో కప్పి ఉండే కశ్మీరం అందాలను చూడలేకపోయినా.. కనీసం మంచునైనా టచ్ చేయాలని పరితపిస్తుంది. సరిగ్గా ఇదే కోరికతో ఓ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వచ్చింది. అయితే.. వాళ్ళు పర్యటనకు వచ్చిన ఈ సీజన్ వేసవికాలం . ఇప్పుడు కశ్మీర్ లో మంచు జాడ ఉండదు. దీంతో ఆ పాప ఆవేదనకు గురైంది. ఒక మీడియా సంస్థ ఆమెను ఇంటర్వ్యూ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఏముందంటే.. ‘ నేను కశ్మీర్ పర్యటనకు వచ్చింది ఎందుకో తెలుసా ? కేవలం మంచును టచ్ చేయడానికి .. కానీ టచ్ చేద్దామంటే మంచు ఎక్కడా కనిపించలేదు.. ఇందుకు నాకు చాలా బాధగా ఉంది ‘ అని ఆ పాప పేర్కొంది. ముద్దుముద్దు మాటలతో.. అద్భుతమైన ఆంగ్ల భాషలో తన మదిలోని భావాలను వ్యక్తీకరించిన ఆ బాలిక పెరు పౌష్పిక. ఇప్పుడు ఈమెపై ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ” నీ వయసులో నాకు ఒకటి , రెండు ఆంగ్ల పదాలు మినహా ఏమీ రాదు’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ వేసవిలోనూ బాల పర్యాటకుల కోసం మంచును సిద్ధంగా ఉంచాలి’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ‘ఆమె మాట్లాడిన ఇంగ్లీష్ ను కాదు.. ఆమె ఆత్మవిశ్వాసం, భావ వ్యక్తీకరణ సామర్ధ్యం ఎంతలా ఉన్నాయో చూడండి’ అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.

 

 

 

 

  Last Updated: 20 Apr 2022, 12:54 PM IST