పాకిస్తాన్ (Pakistan) ప్రస్తుతం అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉంది. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరో వైపు ఉగ్రవాదం పెరిగిపోతుండటంతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అభివృద్ధిపై ఎటువంటి దృష్టి లేకుండా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రపంచ వ్యాప్తంగా విమర్శలకు గురవుతోంది. తాజాగా పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి పాక్ ప్రేరణగా ఉన్నట్టు ఆరోపణలు రావడం దీనికి తార్కాణం.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లోని అసలు పరిస్థితిని చూపిస్తూ నెటిజన్లు ఓ వీడియోను సోషల్ మీడియాల్లో వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో పాకిస్థాన్‌లోని ప్రాంతాలు ఎంత దారుణంగా ఉన్నాయో చెపుతున్నాయి . రోడ్లపై చెత్త, మురుగు నీటితో ప్రజలు జీవనం సాగించాల్సి వస్తోంది. నగరంలోని మౌలిక వసతుల కొరత, పరిశుభ్రత లేకపోవడం పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.
Caste Survey in India : కులగణన సమాజానికి ఎక్స్‌రే లాంటిది – సీఎం రేవంత్
ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. “ఇదేనా అభివృద్ధి?” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన నాయకులు, ప్రజల అవసరాలను విస్మరించి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా పాక్ ప్రభుత్వం ప్రజల జీవిత ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా దృష్టి పెట్టాలంటూ నెటిజన్లు సూచిస్తున్నారు.
ఇదీ పాక్ పరిస్థితి!
తినడానికి సరైన తిండి లేదు గాని కాశ్మీర్ కావాలంట … 🤣🤣🤣#PahalgamTerroristAttack pic.twitter.com/HuiIVT277H— JSP Naresh (@JspBVMNaresh) May 1, 2025