Gobi Manchurian : ఆ టౌన్‌లో గోబీ మంచూరియన్‌పై బ్యాన్.. ఎందుకు ?

Gobi Manchurian : గోబీ మంచూరియన్.. ఇది చాలామందికి ఇష్టమైన వంటకం.

Published By: HashtagU Telugu Desk
Gobi Manchurian

Gobi Manchurian

Gobi Manchurian : గోబీ మంచూరియన్.. ఇది చాలామందికి ఇష్టమైన వంటకం. దాని తయారీకి వాడే సింథటిక్ రంగులు,  పరిశుభ్రతపై ఆహార నిపుణుల ఆందోళనల కారణంగా గోవాలోని మపుసా నగరంలోని ఫుడ్ స్టాల్స్,  విందు కార్యక్రమాలలో గోబీ మంచూరియన్ తయారీపై బ్యాన్ విధించారు. గోవాలోని మపుసా మున్సిపల్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం వల్లే ఈ నగరంలో గోబీ మంచూరియన్‌పై బ్యాన్ అమల్లోకి వచ్చింది. అలా అని.. గోవాలో గోబీ మంచూరియన్‌పై(Gobi Manchurian) బ్యాన్ విధించిన  మొదటి మున్సిపాలిటీ ఇదేనని అనుకోకండి !!

We’re now on WhatsApp. Click to Join

అంతకుముందు 2022 సంవత్సరంలో మోర్ముగావ్ మున్సిపల్ కౌన్సిల్‌ కూడా ఈ తరహా ఆర్డర్‌ను ఇచ్చింది. మోర్ముగావ్‌లోని శ్రీ దామోదర్ ఆలయంలో వాస్కో సప్తాహ్ ఫెయిర్ సందర్భంగా  ఏర్పాటుచేసిన ఫుడ్ స్టాల్స్‌లో గోబీ మంచూరియన్ తయారీపై మోర్ముగావ్ మున్సిపల్ కౌన్సిల్‌ నిషేధం విధించింది. దీంతోపాటు ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులు మోర్ముగావ్‌లోని  గోబీ మంచూరియన్‌ స్టాళ్లపై రైడ్స్ చేసింది. ముంబైకి చెందిన చైనీస్ పాక శాస్త్ర నిపుణుడు నెల్సన్ వాంగ్ 1970లలో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో క్యాటరింగ్ చేస్తూ చికెన్ మంచూరియన్‌ను తొలిసారి తయారు చేశాడు. ఆయన చికెన్‌ నగ్గెట్‌లను స్పైసీ కార్న్‌ఫ్లోర్‌ పిండిలో వేయించి పొడిగా లేదా సోయా సాస్‌, వెనిగర్‌, పంచదార లేదా టోమాట సాస్‌లో గ్రేవీ రూపంలో సర్వ్‌ చేసేవాడు. ఇక శాకాహార ప్రియులకు ఆ లోటును భర్తీ చేసేలా దాని స్థానంలో గోబీ మంచూరియాని తీసుకొచ్చాడు. అలాంటి గోబీ మంచూరియాని ప్రజల ఆరోగ్యం కోసం గోవా నగరం నిషేధించడం విశేషం. ఇలా ప్రతీ నగరంలోని అధికారులు భావిస్తే ప్రజలు అనారోగ్యం బారినపడటం తగ్గుముఖం పడుతుంది కదూ!.

Also Read : Fiji Deputy PM : 8న అయోధ్యను సందర్శించనున్న తొలి విదేశీ నేత

గోబీ మంచూరియా తయారీకి కావాల్సిన పదార్థాలు

  • శనగ పిండి – 1/2 కప్పు
  • కాలి ఫ్లవర్ – 1 పెద్దది
  • మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు
  • కారం పొండి – అర టీ స్పూన్
  • పచ్చిమిర్చి తరిగిన – 1 సన్నగా తరిగిన
  • ఉల్లిపాయ – 1
  •  ఉప్పు – రుచికి తగినంత
  • అల్లం (తురిమిన) – 1 టీస్పూన్
  • టొమాటో కెచప్ – 1 టేబుల్ స్పూన్
  • గ్రీన్ చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్
  • సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్
  • వైట్ వెనిగర్ – 1/2 టేబుల్ స్పూన్
  • నీరు – 1/2 కప్పు
  • తగినంత నూనె (వేయించడానికి)

గోబీ మంచూరియా ఎలా చేయాలి?

గోబీ మంచూరియా చేయడానికి, ముందుగా శనగ పిండి, మొక్కజొన్న పిండిని తీసుకోండి. నెమ్మదిగా నీటిని జోడించి పేస్ట్ లా సిద్ధం చేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా కారం పొడి వేయాలి. దీని తర్వాత బాగా కలపాలి.దీని తరువాత, తరిగిన కాలిఫ్లవర్ పెద్ద ముక్కలను తీసుకోండి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి వేడి చేయాలి. సిద్ధం చేసుకున్న శెనగపిండిలో కాలీ ఫ్లవర్ ముక్కలను వేయాలి.దీని తరువాత, నూనెలో శెనగపిండిలో పూసిన కాలి ఫ్లవర్ ముక్కలను వేయించాలి. కాలిఫ్లవర్ ముక్కలు బంగారు గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించాలి. దీని తరువాత, దానిని తీసివేసి ప్రత్యేక పాత్రలో ఉంచండి.ఇప్పుడు ఒక బాణలిలో 2 చెంచాల నూనె వేసి అందులో తురిమిన అల్లం, సన్నగా తరిగిన ఉల్లిపాయ వేయాలి.అందులో 1 చెంచా టొమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, ఒక చెంచా సోయా సాస్ కలపండి. అలాగే వదిలేసి వేయించాలి. ఆ తర్వాత అందులో అర చెంచా వైట్ వెనిగర్ వేయాలి. ఇప్పుడు అరకప్పు నీళ్లు పోసి బాగా వేయించాలి.ఇప్పుడు అందులో వేయించిన కాలి ఫ్లవర్ ముక్కలు జోడించండి. ఇప్పుడు వీటిని బాగా కలపాలి.ఇప్పుడు మీకు టేస్టీ క్యాబేజీ మంచూరియా రెడీ అవుతుంది. కావాలంటే దీనిపై సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేయవచ్చు.

  Last Updated: 05 Feb 2024, 12:51 PM IST