Family With 72 members: ఆ కుటుంబంలో 72 మంది సభ్యులు.. పాపం కొత్తకోడలు కష్టాలు చూస్తే..!!

  • Written By:
  • Updated On - November 16, 2022 / 11:55 AM IST

గతంలో పల్లెల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒక కుటుంబంలో పదుల సంఖ్యలో సభ్యులు ఉంటుండే. వ్యవసాయం పనులు చేస్తూ చక్కగా జీవించేవారు. ఎవరి పనులు వారికి ఉండేవి. ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లు ఇంటి పనికే పరిమితం అయ్యేవారు. మిగతావాళ్లు పొలల పనులకు వెళ్లేవారు. ఇలా కుటుంబం అంతా కలిసి మెలిసి ఉండేది. ఎవరికి కష్టం వచ్చినా… వూరంతా ఏకం అయ్యేది. కానీ ఇఫ్పుడు ఉమ్మడి కుటుంబాలు మచ్చుకైనా కనిపించడంలేదు. ఐక్యమత్యము, ఆత్మీయత, ప్రేమ అనుగారాలు వీటికి అర్థం లేకుండా పోయింది. పక్కింట్లో ఆపద వస్తే డోర్లు మూసుకునే రకం ఇప్పుడు. మాట పలకరింపులు లేవు. సహాయ సహకారాలు లేవు. ఇది కాలానుగుణంగా వస్తున్న మార్పు.

కానీ మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందిన ఓ కుటుంబాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ ఉమ్మడి కుటుంబంలో 72మంది సభ్యులు ఉన్నారు. అందరూ ఒకే ఇంట్లో జీవిస్తున్నారు. దోయిజోడ్ కుటుంబంలో రోజుకు రూ. 1000 నుంచి రూ. 1200 ల కూరగాయలు కొనుగోలు చేస్తారు. ప్రతిరోజూ పది లీటర్ల పాలు వినియోగిస్తారు. కర్నాటకకు చెందిన దోయిజోడే కుటుంబం సుమారు వందేళ్ల క్రితం షోలాపూర్ కు వలస వచ్చింది. ఇక్కడే వ్యాపారం చేస్తూ నాలుగు తరాలు ఒకే ఇంట్లో ఉంటున్నాయి. కుటుంబంలో సభ్యుల సంఖ్యను చూసి కొత్త కోడలు మొదట్లో వణికిపోయిందట. వామ్మో వీరందరికి వంటచేసిపెట్టడం నాతో కాదంటూ ఏడ్చిందట. కానీ తర్వాత అందరిలో కలిసి పోయిందట.

ఈ కుటుంబానికి సంబంధించిన వీడియోను @Ananth_IRASయూజర్ పేరుతో ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియోనూ BBCలోనూ ప్రసారం చేశారు. భారత ఉమ్మడి కుటుంబం యొక్క ఆనందం అంటూ క్యాప్షన్ జోడించారు.

ఈ వీడియోలో కుటుంబ యజమాని మాట్లాడుతూ…మాది పెద్ద కుటుంబం, మాకు ఉదయం సాయంత్రం పది లీటర్ల పాలు అవసరం. ప్రతిరోజు 12వందల రూపాయల కూరగాయలు కొనుగోలు చేస్తాం. ఏడాదికి సరిపడా బియ్యం, గోధుమలు, పప్పులు ఒకేసారి కొనుగోలు చేస్తాం. ఉమ్మడి కుటుంబంతో మేము సంతోషంగా ఉన్నామని తెలిపారు.

కొత్త కోడలు నైనా దోయిజోడే మాట్లాడుతూ..ఈ కుటుంబంలో పుట్టిన పెరిగినవారు ఎక్కడైనా జీవిస్తారు. నాకు పెళ్లయిన మొదట్లో కాస్త ఇబ్బందిగా ఉండేది. కుటుంబ సభ్యుల సంఖ్య చూసి భయపడ్డాను. కానీ నాకు అందరూ సాయం చేసేవారు. తర్వాత సర్దుకుపోవడం నేర్చుకున్న. మా అత్తగారు నాకు బాగా సహకరిస్తారు. ఇప్పుడుఅంతా మామూలే అంటూ చెప్పుకొచ్చారు.

సోషల్ మీడియాలో ఈ కుటుంబంపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ అద్భుతమైన కుటుంబం అంటూ కామెంట్ చేయగా..భారతీయ సంస్కృతిని ప్రశంసించారు. ఈ కుటుంబం చాలా అందంగా ఉంది… విచారకరం… భారతీయులమైన మనం 21 శాతాబ్దం ప్రారంభంలో ఉమ్మడి కుటుంబం అనే భావనను కోల్పోయాం అంటూ కామెంట్స్ జోడించారు.