Govt School : పిల్లలను ఆ ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్ చేయిస్తే రూ.5000

సాధారణంగా గవర్నమెంట్ స్కూల్ లో చేరితే .. ఫీజు ఉండదు! మిడ్ డే మీల్స్ ఉంటాయి.. ఫ్రీగా బుక్స్ ఇస్తారు !

  • Written By:
  • Publish Date - June 21, 2022 / 03:00 PM IST

సాధారణంగా గవర్నమెంట్ స్కూల్ లో చేరితే .. ఫీజు ఉండదు! మిడ్ డే మీల్స్ ఉంటాయి.. ఫ్రీగా బుక్స్ ఇస్తారు ! కానీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఆ పాఠశాలలో పిల్లల్ని చేర్పించే తల్లిదండ్రులకు 5000 రూపాయలు ఇస్తున్నారు. ఔను.. ఇది నిజమే. ఈ సంచలన అడ్మిషన్ ఆఫర్ ను గోధుమ కుంట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అమలు చేస్తున్నారు. స్కూళ్ళో అడ్మిషన్లు పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వెనుక ఇద్దరు వ్యక్తుల చొరవ, తాపత్రయం, గొప్ప సంకల్పం ఉంది. వారే.. గోధుమ కుంట గ్రామ సర్పంచ్ మహేంద్ర రెడ్డి, ఉప సర్పంచ్. వీరిద్దరూ కలిసి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్లు పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.దీనికి సంబంధించిన ఫ్లెక్సిని కూడా స్కూల్ ముందు ఏర్పాటు చేయించారు. ఈ స్కూల్లో జాయిన్ అయ్యే పిల్లలకు యూనిఫామ్స్, సాక్స్, బ్యాగ్, బస్ పాస్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలను కూడా పెద్ద ఎత్తున పెంచారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 7వ తరగతి పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన జరుగనుంది.