Site icon HashtagU Telugu

Pushpa Srivalli Song : టామ్ అండ్ జ‌ర్రీల‌కు పాకిన పుష్ప శ్రీవ‌ల్లి ఫీవ‌ర్‌

Tom And Jerry Pushpa

Tom And Jerry Pushpa

పుష్ప సాంగ్ విడుద‌ల‌యిన‌ప్ప‌టి నుంచి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తూనే ఉంది. అటు ఇన్‌స్టాగ్రామ్‌, ఇటు ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ల‌లో ల‌క్ష‌లాదిగా దీనిపై మీమ్స్ పుట్టుకొచ్చాయి. తాజాగా టామ్ అండ్ జ‌ర్రీ కేరెక్ట‌ర్లు ఈ సాంగ్‌కి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంద‌నే ఐడియా వ‌చ్చిందో యూట్యూబ‌ర్‌కి. వెంట‌నే ఓ మీమ్ క్రియేట్ చేసిప‌డేశాడు. ఇప్పుడు అది కూడా తెగ వైర‌ల్ అవుతోంది.

ముఖేష్ జి అనే యూట్యూబ‌ర్ ఈ వీడియోను క్రియేట్ చేశాడు. సామీ సామీ సాంగ్‌కు అచ్చం హీరో హీరోయిన్ల మాదిరిగానే టామ్ అండ్ జ‌ర్రీలు డ్యాన్స్ చేయ‌డంతో జ‌నం తెగ షేర్లు కొడుతున్నరు. ఇప్ప‌టికే ఈ వీడియోను నాలుగుల‌క్ష‌ల‌మందికిపైగా చూశారు.