Site icon HashtagU Telugu

Black Hole: ప్రతి సెకనుకు ఒక భూమిని మింగేయగల బ్లాక్ హోల్ గుర్తింపు

Black Hole

Black Hole

పాల పుంత.. అదేనండీ గెలాక్సీలో ఎన్నో బ్లాక్ హోల్స్ ఉన్నాయి. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని ఒక బ్లాక్ హోల్ ను ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. 900 కోట్ల ఏళ్ల వయసు కలిగిన ఆ బ్లాక్ హోల్ సైజు అత్యంత వేగంగా పెరుగుతోంది.

ఎంత వేగంగా అంటే.. ప్రతి సెకనుకు మన భూమి సైజు ఉన్నంత ప్రదేశాన్ని తనలోకి కలుపుకునేంతగా!! మొత్తం పాలపుంత నుంచి విడుదలయ్యే కాంతి కంటే 7000 రెట్లు ఎక్కువ కాంతివంతంగా ఈ బ్లాక్ హోల్ ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. “స్కై మ్యాపర్” అనే అతిపెద్ద, శక్తివంతమైన టెలి స్కోప్ ద్వారా ఈ బ్లాక్ కదలికలను గుర్తించామన్నారు.

ఒకదాని వెంట మరొకటి జంటగా తిరిగే ” బైనరీ స్టార్స్” ను టెలి స్కోప్ తో వెతికే ప్రయత్నంలో ఉండగా అకస్మాత్తుగా ఈ బ్రైటెస్ట్ బ్లాక్ హోల్ కంట పడింది. కనీవినీ ఎరుగనంత సైజులోకి ఈ బ్లాక్ హోల్ మారడానికి ఒక ఘటన కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అదేమిటంటే.. రెండు పెద్ద పాలపుంతలు ఒకదాన్నొకటి ఢీకొనగా వెలువడిన మెటీరియల్ ఈ బ్లాక్ హోల్ లోకి ప్రవేశించి సైజును పెంచి ఉండొచ్చు.