Site icon HashtagU Telugu

Thief Video: రైలు కిటికీలోంచి మొబైల్ చోరీకి యత్నం.. బుద్ధి చెప్పిన ప్రయాణికులు!

Train

Train

రైలు కిటికీలోంచి మొబైల్ చోరీకి ప్రయత్నించిన ఓ దొంగకు రైలు ప్రయాణికులు తగిన బుద్ధి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీహార్‌లోని సాహెబ్‌పూర్ కమల్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఒక దొంగ రైలు నుండి కిటికీలోంచి మొబైల్‌ను దొంగిలించడానికి ప్రయత్నించాడు.

అయితే అప్రమత్తమైన ప్రయాణీకుడు అతని చేయి పట్టుకున్నాడు. రైలు ముందుకు కదులుతున్నప్పుడు ప్రయాణీకులు దొంగను విడిచిపెట్టలేదు.  తనను పట్టుకోమని ప్రయాణికులకు మరో చేయి ఇచ్చి కరుణించమని వేడుకున్నాడు. రైలు ఖగారియా రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే, అక్కడున్న ప్రయాణికులు సైతం దొంగను ఘోరంగా తిట్టారు. పోలీసులు పట్టుకున్నారో లేదో తెలియదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.