Site icon HashtagU Telugu

Success story: శభాష్ సంగీత : వ్యవసాయం చేస్తూ.. మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ!

ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగం అని నిరూపిస్తున్నారు ఈ తరం మహిళలు. ఒకవైపు ఇంటి బాధ్యతలు మోస్తూనే.. మరోవైపు తమకు నచ్చిన రంగాల్లో రాణిస్తున్నారు. పురుషులతో సమానంగా పనిచేస్తూ ‘వీ కెన్ డు ఎనీ థింగ్’ అంటూ  కష్టసాధ్యమైన పనులు చేస్తున్నారు. తాము ఇక ‘వంటిల్లు కుందేళ్లు’ అనే ట్యాగ్ చెరిపేస్తున్నారు. వ్యవసాయం అంటేనే కష్టంతో కూడుకున్న పని. మగవాళ్లు సైతం ఎన్నో ఇబ్బందులు పడతారు. సేద్యం చేయడం అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు.. కానీ నాసిక్‌లోని మాటోరి గ్రామానికి చెందిన సంగీత పింగలే వ్యవసాయం చేస్తూ ఇతర మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది.

ఈమె జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళు ఉన్నాయి. అయినా వాటిని తట్టుకొని వ్యవసాయంలో రాణిస్తున్నారు. “2007లో నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ సమయంలో నేను నా మూడవ బిడ్డతో తొమ్మిది నెలల గర్భవతిని. పదేళ్లపాటు మా మామగారు, బంధువులు నన్ను ఆదరించారు. అయితే 2017లో కుటుంబ కలహాల కారణంగా ఉమ్మడి కుటుంబం విడిపోవడంతో సంగీత తన అత్తమామలు, పిల్లలతో కలిసి జీవించడం ప్రారంభించింది. రెండు నెలల తర్వాత ఆమె మామగారు అనారోగ్యంతో మరణించడంతో మరో విషాదం నెలకొంది. “జీవితంలో ఎప్పుడూ నన్ను ఆదరించేవాళ్లు వెళ్లిపోయారు. అయితే సంగీత తన మామగారు వదిలిపెట్టిన 13 ఎకరాల పొలానికి ఇప్పుడు ఏకైక సంరక్షుకురాలిగా మారింది.

వ్యవసాయం చేయడమంటే చాలా కఠినమైన టాస్క్. ట్రాక్టర్ నడపడం, యంత్రాలను రిపేర్ చేయడం, సాధనాలను ఉపయోగించడం, ఉత్పత్తులను కొనుగోలు చేయడం కోసం మార్కెట్‌కు వెళ్లడం లాంటివన్నీ చేయాలి. సంగీత కూడా ద్విచక్ర వాహనం నడపడం, ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. ట్రాక్టర్ పాడైపోయిన భాగాన్ని రిపేర్ చేయడానికి ఆమె వెనుకాడేదీ కాదు. తనకున్న పొలంలో ద్రాక్ష సాగు చేయడం ప్రారంభించింది. ఆకాల వర్షాలు, కూలీల కొరత కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మొదట్లో ఎన్నో కష్టాలు ఆమెను వెంటాడాయి. టెక్నాలజీ ఉపయోగించి, వ్యవసాయ పద్ధతులను తెలుసుకొని పూర్తిగా పట్టు సాధించారు. ప్రస్తుతం సంవత్సరానికి 800-1,000 టన్నుల ద్రాక్ష దిగుబడిని ఉత్పత్తి చేస్తుంది, ఆమెకు రూ. 25-30 లక్షలు సంపాదించింది. ఈ రోజు, సంగీత కుమార్తె గ్రాడ్యుయేషన్ చదువుతోంది, ఆమె కొడుకు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. తనపై అనుమానం ఉన్నవారికి తానేమిటో నిరూపించుకోగలిగినందుకు గర్వపడుతున్నానని అంటోందిమే.

Exit mobile version