Site icon HashtagU Telugu

Pm Mother In Law : బ్రిటన్ పీఎం అత్తగారినంటే నమ్మలేదు

Pm Mother In Law

Pm Mother In Law

సుధామూర్తి.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి సతీమణి(Pm Mother In Law). రచయితగా, దాతృత్వ కార్యక్రమాలు చేసే వ్యక్తిగా ఆమెకు గుర్తింపు ఉంది. సుధామూర్తి సేవలకుగానూ ఈ ఏడాది పద్మభూషణ్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. కోట్ల ఆస్తులు ఉన్నా.. ఎంతో పలుకుబడి ఉన్నా ఆమె కట్టూబొట్టూ చాలా సింపుల్ గా ఉంటుంది. ఎక్కడైనా జర్నీ చేస్తుంటే.. ఆమె అందరిలో ఒకరిగా కలిసిపోతుంటారు. కొన్నిరోజుల కిందట బాలీవుడ్ టాక్ షో “ది కపిల్ శర్మ”లో సుధామూర్తి పాల్గొన్నారు. ఈసందర్భంగా తవ వ్యక్తిగత జీవితంలోని పలు ఆసక్తికర అంశాలను ఆమె వివరించారు. ఈక్రమంలో ఇటీవల కూతురు అక్షతను కలవడానికి లండన్‌ కు వెళ్ళినప్పుడు ఎదురైన చేదు అనుభవం గురించి ఇలా చెప్పుకొచ్చారు.

ALSO READ : Sudha Murthy: నా భర్తను మొదటిసారి చూసి ఎవరి చిన్నపిల్లవాడు అనుకున్నాను.. సుధామూర్తి కామెంట్స్ వైరల్?

“10 డౌనింగ్ స్ట్రీట్” అడ్రస్(Pm Mother In Law) రాసిచ్చాను..

” కొన్ని రోజుల కిందటే నేను లండన్ కు వెళ్లాను. ఎయిర్‌పోర్టులో దిగగానే ఇమిగ్రేషన్ అధికారులు నా రెసిడెన్షియల్ అడ్రస్ అడిగారు. లండన్‌లో మీరు ఎక్కడ ఉంటారో చెప్పమన్నారు. నా కొడుకు కూడా యూకేలోనే ఉంటాడు. కానీ, ఆ ఇంటి అడ్రస్ నాకు పర్ఫెక్ట్ గా గుర్తుకు లేదు. దీంతో నా అల్లుడు, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికారిక నివాసం “10 డౌనింగ్ స్ట్రీట్” అడ్రస్(Pm Mother In Law) రాసి ఇచ్చాను. అది చూడగానే ఇమిగ్రేషన్ అధికారి నన్ను ఎగాదిగా చూశాడు. జోక్ చేస్తున్నారా అని కామెంట్ చేశాడు. దీంతో నేను నిజం చెప్పినా వారు నమ్మినట్లు నాకు అనిపించలేదు. నాలాగా సింపుల్‌గా ఉండే మహిళ ఒక ప్రధానికి అత్తగారంటే ఎవరూ నమ్మరని నాకు ఆ క్షణంలో అర్థమైంది” అని సుధామూర్తి వివరించారు. తన పెళ్లి, కుటుంబం గురించి కూడా పలు విషయాలను ఆమె చెప్పారు. పెళ్లి కాక ముందు నారాయణ మూర్తిని తొలిసారి చూసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన హీరోలా ఉంటారమేమోనని తాను అనుకున్నానని పేర్కొన్నారు. “మా ఆయన (నారాయణ మూర్తి) పెళ్లికాక ముందు ఎంత బరువు ఉండేవారో .. ఇప్పుడూ అంతే బరువు ఉన్నారు. నాకు సరిగ్గా వంట రాకపోవడం వల్లే ఆయన అలా ఉండిపోయారు” అని సుధామూర్తి అనగానే “ది కపిల్ శర్మ”లో నవ్వులు పూశాయి. సుధామూర్తి, నారాయణ మూర్తి వివహాం 1978లో జరిగింది. వీరికి కుమార్తె అక్షతా, కుమారుడు రోహన్ ఉన్నారు.

Exit mobile version