Site icon HashtagU Telugu

Musi : తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు..చేస్తున్న పద్ధతికి వ్యతిరేకం: ఈటల

They are not against Musi cleansing..against the way it is being done: Etela

They are not against Musi cleansing..against the way it is being done: Etela

Etela Rajender : బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మంగళవారం ఫతేనగర్ డివిజన్ లో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌కు హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హైడ్రా ఉద్దేశం వేరే ఉందని నేను చెప్పిన మాటలు ఇప్పటికీ ప్రజలు, నమ్ముతున్నారని అన్నారు. మూసీ ప్రక్షాళన తర్వాత ముందు మురికినీళ్లను శుద్ధి చేయండని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రసాయన వ్యర్థాలను శుద్ధి చేస్తేనే మూసీ బాగుపడుతుందని సూచించారు. తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, చేస్తున్న పద్ధతికి వ్యతిరేకమని అన్నారు.

ప్రజల సమస్యల మీద నేను కొట్లడుతున్నారని, మీ సహకారం లేనిదే అది పూర్తి కాదని చెప్పారు. ఎంత తిరిగినా ఒడవని నియోజకవర్గం మల్కాజిగిరి నన్ను గెలిపించి నాలుగు నెలలు దాటిందన్నారు. ఈ నాలుగు నెలల కాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు తప్ప ప్రతిరోజు మల్కాజిగిరి నియోజకవర్గంలోనే తిరుగుతున్నట్లు వెల్లడించారు. ఎంత తిరిగినా ఒడవని నియోజకవర్గం ఇదని, ఎంత విన్నా ఒడవని గాధ ఉంది ఇక్కడ అని తెలిపారు. కలెక్టరు, హెచ్ఎండీఏ కమిషనర్న, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎండీని ఎమ్మెల్యేలు అందరితో కలిశామన్నారు. అక్కడికి వెళ్ళినా డబ్బులు లేవంటున్నారని, కేంద్రంలో అర్బన్ డెవలప్మెంట్ మంత్రిని కూడా కలిశామన్నారు. స్వచ్ఛ భారత్, స్మార్ట్ సిటీ కింద డబ్బులు ఇవ్వమని కోరినట్లు వెల్లడించారు.

Read Also: Bogus Court : బోగస్ కోర్టు నడిపిన ఘరానా మోసగాడు.. ఇలా దొరికిపోయాడు