Site icon HashtagU Telugu

Electric Scooters : ల‌క్ష లోపు ఎల‌క్ట్రిక్ బండి కొనాలా? ఇవిగో లిస్ట్‌..

Elec Scooters1

Elec Scooters1

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బంది పడుతున్నారా ? మీ బడ్జెట్ లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటున్నారా ? అయితే ఇది మీరు తప్పకుండా చదవాల్సిందే. మీ కోసం ఇండియా లో విక్రయించే లక్ష రూపాయలలోపు ఎలక్ట్రిక్ స్కూటర్లు మీకోసం…

OLA S1
OLA S1: ఈ మోడల్ కి 2.98KWh బ్యాటరీ తో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 121 కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు. గంటకు 90km వేగంతో ప్రయాణిస్తుంది. 85,000 నుండి లక్ష రూపాయిల వరకు దీని ధర ఉంటుంది.

బౌన్స్ ఇన్ఫినిటీ E1
ఢిల్లీ లో ఎక్స్ షోరూం ప్రైస్ 68,999. దీనికి 2kWh 48V బ్యాటరీ కలదు. ఈ మోడల్ కి డ్రాగ్ మోడ్, ఎకో మోడ్, పవర్ మోడ్ అని మూడు రకాల మోడ్స్ ఉంటాయి. పవర్ మోడ్ లో హై స్పీడ్ 65KMPH వరకు వెళ్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎకో మోడ్ లో 85km వెళ్తుంది.

హీరో ఎలక్ట్రిక్ NYX HX
హీరో ఎలక్ట్రిక్ NYX HX కు డ్యూయెల్ బ్యాటరీ (51.2 Volt 30AH) ఉంటుంది. దీని అత్యధికి స్పీడ్ గంటకు 42 కిలోమీటర్లు. ఫుల్ ఛార్జ్ చేయడానికి 4-5 గంటల సమయం పాడుతుంది. ప్రస్తుతం ఢిల్లీ లో దీని ధర రూ : 67,540.

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమ HX
ఈ మోడల్ షోరూం ప్రైస్ రూ : 65,640. ఇది ఒక్కసారి ఫుల్ గా ఛార్జ్ చేస్తే 122 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఫుల్ ఛార్జ్ చేయడానికి 4 నుండి 5 గంటల సమయం పాడుతుంది. గంటకు 42 కిలోమీటర్ల వేగం వెళ్తుంది.