Microsoft to Netflix: టెక్ కంపెనీల్లో.. ఉద్యోగుల ఊస్టింగ్!!

టెక్ రంగంలోని జాబ్ మార్కెట్‌లో గందరగోళం నెలకొంది.మైక్రోసాఫ్ట్ నుంచి నెట్‌ఫ్లిక్స్ వ‌ర‌కూ ఎన్నో టెక్ కంపెనీలు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగ కోతలు పెడుతున్నాయి.

  • Written By:
  • Publish Date - July 20, 2022 / 09:30 PM IST

టెక్ రంగంలోని జాబ్ మార్కెట్‌లో గందరగోళం నెలకొంది.మైక్రోసాఫ్ట్ నుంచి నెట్‌ఫ్లిక్స్ వ‌ర‌కూ ఎన్నో టెక్ కంపెనీలు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగ కోతలు పెడుతున్నాయి. వ్యాపార వ్యయాలను తగ్గించుకునే చర్యల్లో భాగంగా పలు సంస్థలు హైరింగ్ ప్ర‌క్రియ‌ను నిలిపివేస్తున్నాయి. దీంతో ఉద్యోగార్థులు కూడా ఆందోళనకు లోనవుతున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నా .. ఆర్ధిక మంద‌గ‌మ‌నాన్ని కారణంగా చూపుతూ టెక్ కంపెనీలు ఖ‌ర్చులు త‌గ్గించుకునే ప‌నిలో పడ్డాయి.

మైక్రోసాఫ్ట్ లో..

మైక్రోసాఫ్ట్ కంపెనీ వ్య‌వ‌స్ధాగ‌త స‌ర్ధుబాట్ల‌లో భాగంగా ఇటీవ‌ల 1800 మంది ఉద్యోగుల‌ను తొల‌గించింది. అయితే నియామ‌క ప్ర‌క్రియను కొన‌సాగిస్తామ‌ని మైక్రోసాఫ్ట్ వెల్ల‌డించింది.

నెట్‌ఫ్లిక్స్ లో..

నెట్‌ఫ్లిక్స్ రెండు విడ‌త‌ల్లో మొత్తం 450 మంది ఉద్యోగుల‌కు ఉద్వాసన పలికింది.ఈ ఏడాది చివ‌రిలో మ‌రింత మంది ఉద్యోగుల‌పై వేటు వేస్తామ‌ని వెల్ల‌డించింది. కంపెనీ స‌బ్‌స్క్రైబ‌ర్ల సంఖ్య త‌గ్గిపోవ‌డం, రాబ‌డి గ‌ణ‌నీయంగా ప‌డిపోవ‌డంతో ఈ దిశగా చర్యలు చేపట్టింది.

టెస్లాలో..

ఎల‌న్ మ‌స్క్‌కు చెందిన టెస్లా కంపెనీ 229 మంది ఉద్యోగుల‌పై వేటు వేసింది. నియామకాల ప్ర‌క్రియ‌ను కూడా నిలిపివేసింది.
శాన్ మ‌టియో, కాలిఫోర్నియా కార్యాల‌యాల‌ను మూసివేసింది. ఆర్ధిక మంద‌గ‌మ‌నం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

ట్విట్ట‌ర్ లో..

ట్విట్టర్ కూడా ఉద్యోగ కోతల బాట పట్టింది.టాలెంట్ అక్విజిష‌న్ టీంలో 30 శాతం సిబ్బందిని తొల‌గించినట్లు తెలుస్తోంది. వారికి రిలీఫ్ ప్యాకేజీని ఆఫర్ చేసినట్టు సమాచారం.ప్ర‌పంచ‌వ్యాప్తంగా హైరింగ్‌ను కూడా ఆపేసింది.