WhatsApp Hidden Features : అందరూ వాట్సాప్ వాడే వాళ్లే.. వాడని వాళ్లు చాలాచాలా తక్కువగా ఉంటారు. అంతగా వాట్సాప్ ప్రజలకు దగ్గరైంది. దాని వినియోగం అంత ఈజీగా ఉంటుంది. దాని మెసేజింగ్ అంత ఫాస్ట్‌గా ఉంటుంది. అయితే చాలామంది యూజర్లకు వాట్సాప్‌లోని కొన్ని ఫీచర్లు నేటికీ బొత్తిగా తెలియవు. ఇవాళ మనం టాప్-5 వాట్సాప్ హిడెన్ ఫీచర్ల (WhatsApp Hidden Features) వివరాలను తెలుసుకుందాం.
We’re now on WhatsApp. Click to Join.
సీక్రెట్ కోడ్ ఫర్ ఛాట్స్
మనం వాట్సాప్‌లో రోజూ చాలా ఛాట్స్ చేస్తుంటాం. వాటిలో కొన్ని అందరికీ కనిపించకూడదని కూడా భావిస్తాం. అలాంటి వ్యక్తిగత ఛాట్స్‌ను, ముఖ్యమైన ఛాట్స్‌ను సీక్రెట్‌గా దాచడానికి ‘సీక్రెట్ కోడ్’ అనే ఫీచర్ వాట్సాప్‌లో ఉంది. దీన్ని వాడుకొని మన పర్సనల్ చాట్లను లాక్ చేయొచ్చు. ఇలా మనం లాక్ చేసే వాట్సాప్ ఛాట్స్ ఇంకెవరికీ కనిపించకుండా దాచేయొచ్చు. దీని వల్ల మన ప్రైవసీని కాపాడుకోవచ్చు.
వీడియో కాల్ స్క్రీన్ షేరింగ్
వాట్సాప్‌లో మనం వీడియో కాల్స్ కూడా చేస్తుంటాం. ఈ కాల్స్ చేసే టైంలో స్క్రీన్ దిగువ భాగంలో Share అనే ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే.. స్క్రీన్ షేరింగ్‌కు ఎవరిని అనుమతించాలి ? అనుమతించాలా ? వద్దా ? అనే పర్మిషన్స్‌ను అడుగుతుంది. వాటికి ఓకే చెప్పగానే.. మీరు ఎవరెవరికి వీడియో కాల్ స్క్రీన్‌ను షేర్ చేయాలని అనుకుంటున్నారో, వాళ్లందరికీ లైవ్‌లో మీ స్క్రీన్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ ల్యాండ్ స్కేప్ మోడ్‌లోనూ పనిచేస్తుంది. దీని వల్ల వాట్సాప్‌ను డెస్క్‌టాప్‌లో ఉపయోగించినప్పుడు మంచి వ్యూ ఉంటుంది. ఈ ఫీచర్‌ను గ్రూప్ కాల్స్‌లో సైతం వాడొచ్చు.
షార్ట్ వీడియో మెసేజ్
రియల్‌టైమ్ వాయిస్ మెసేజ్ ఫీచర్లాగే షార్ట్ వీడియో ఫీచర్ కూడా పనిచేస్తుంది. టెక్ట్స్ బాక్స్ పక్కనే వీడియో రికార్డింగ్ అనే ఐకాన్ ఉంటుంది. దీన్ని వాడుకొని మనం 60 సెకన్ల నిడివి కలిగిన వీడియో మెసేజ్‌లను రికార్డ్ చేసి.. అనంతరం వాటిని మెసేజ్ రూపంలో ఫ్రెండ్స్‌కు, సన్నిహితులకు పంపొచ్చు.
Also Read: Lok Sabha polls 2024 : అశోకుడి గడ్డపై నుంచి ప్రధాని మోడీ ప్రచార శంఖారావం
ఏఐ స్టిక్కర్స్
మనం సొంతంగా స్టిక్కర్లను క్రియేట్ చేసుకునేందుకు ఏఐ స్టిక్కర్స్ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీన్ని వాడుకునేందుకు మనం వాట్స్ప్లోని స్టిక్కర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత క్రియట్ బటన్ని నొక్కాలి. వెంటనే మనకు ఒక సెర్చ్ బార్ కనిపిస్తుంది. అందులో మనకు నచ్చిన స్టిక్కర్లను సొంతంగానే క్రియేట్ చేయొచ్చు.
వన్ టైమ్ వాయిస్ మెసేజ్
మనం చాలా ముఖ్యమైన సమాచారాన్ని ఎవరికైనా వాట్సాప్‌లో పంపాలని అనుకున్నప్పుడు ‘వన్‌టైమ్ లిజన్ వాయిస్ మెసేజ్’ ఫీచర్‌ను వాడుకోవచ్చు. దీని ద్వారా మనం పంపే వాయిస్ మెసేజ్ ఇతరులకు ఫార్వర్డ్ చేయలేరు. షేర్ చేయలేరు. సేవ్ కూడా చేయలేరు. ఇతరులు ఆ మెసేజ్‌ను స్టార్ చేయడం, రికార్డ్ చేయడం కూడా కుదరదు.