Mars: ఇదివరకు మీరు ఎప్పుడు చూడని మార్స్ ఫోటోలు.. అరుణ గ్రహం ఎంత అందంగా ఉందో?

ప్రస్తుతానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కు అత్యంత ఇష్టమైన గ్రహం అంగారకుడు.

  • Written By:
  • Publish Date - June 29, 2022 / 02:00 PM IST

ప్రస్తుతానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కు అత్యంత ఇష్టమైన గ్రహం అంగారకుడు. అయితే ఇప్పటికే క్యూరియోసిటీ రోవర్ ద్వారా వేలకొద్ది ఫోటోలను తెప్పించుకొని పరిశీలించింది నాసా. గత ఏడాది ఫిబ్రవరి 18న మార్స్ పై దిగిన పెర్సెవరెన్స్ రోవర్ ద్వారా అంగారక గ్రహం పై మట్టి ప్రయోగాలు చేస్తోంది.

ఈ క్రమంలోనే ఇప్పటికే వేలకొద్ది ఫోటోలను తెప్పించుకుంటోంది. ఇప్పటివరకు ఈ రోవర్ దాదాపుగా 2,45,448 ఫోటోలను నాసా కి పంపింది.ఇప్పటికీ ఫోటోలను పంపిస్తూనే ఉంది. మరి వాటిలో కొన్ని ఫోటోల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెర్సెవరెన్స్ రోవర్ 687 రోజులు పని చేయాలని నాసా టార్గెట్ పెట్టుకుంది.

ఈ 687 నెంబర్ ఏమిటంటే భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి 365 రోజులు పట్టగా అంగారగుడికి 687 రోజులు పడుతుంది. ఇక మార్స్ పై మట్టిని సేకరించి దానిని ఒక చిన్న బాక్సులో ఉంచుకుంది రోవర్. అలాగే మార్స్ పై రకరకాల రంగుల్లో రాళ్లు ఉన్నట్లు ఫోటోలు చెబుతున్నాయి.

మార్స్ పై కూడా విపరీతమైన గాలి రాపిడి ఉన్నందువల్ల కూడా రాళ్లు కూడా ఆగిపోతున్నాయి. రోవర్ ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు నీరు ఉండేదని అక్కడ పెద్ద చెరువు లాంటివి ఉండేదని అంచనా వేస్తున్నారు.

అయితే అందులో అక్కడున్న కొన్ని రాళ్ళను ప్రత్యక్షంగా చూడాలి అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మార్స్ పై అక్కడక్కడా కొన్ని ప్రత్యేకమైన రాళ్లు రెండేసి పొరలుగా ఉన్నాయి. అక్కడ ఉన్న గాలి వల్లే ఇవి ఇలా మారాయి అన్నది అంచనా. అలాగే అక్కడక్కడ రోవర్ కి సంబంధించిన వస్తువులు కనిపిస్తూ ఉంటాయి.