No Need For Registration : ఈ-స్కూటర్లకు రిజిస్ట్రేషన్ అక్కర్లేదు

కొన్న తర్వాత..  రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేని స్కూటర్లు కూడా ఉన్నాయి తెలుసా ? వాటి ధర చాలా తక్కువ !! ఆ స్కూటర్లు ఏవి ? వాటికి ఎందుకు రిజిస్ట్రేషన్ (No Need For Registration) అక్కర లేదు ? ఇప్పుడు తెలుసుకుందాం.. 

  • Written By:
  • Updated On - May 27, 2023 / 03:15 PM IST

కొన్న తర్వాత..  రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేని స్కూటర్లు కూడా ఉన్నాయి తెలుసా ? వాటి ధర చాలా తక్కువ !!

ఆ స్కూటర్లు ఏవి ? వాటికి ఎందుకు రిజిస్ట్రేషన్ (No Need For Registration) అక్కర లేదు ? ఇప్పుడు తెలుసుకుందాం.. 

సెంట్రల్ మోటార్  వెహికల్ రూల్స్ (CMVR) ప్రకారం.. 250 వాట్స్ కంటే తక్కువ పవర్ అవుట్‌పుట్, 25 kmph లోపు  గరిష్ట వేగం కలిగిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను లో స్పీడ్ వెహికల్స్ గా పరిగణిస్తారు.

ఇప్పుడు మేము మీకు అలాంటి 5  లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి చెప్పబోతున్నాం. వీటికి  రిజిస్ట్రేషన్(No Need For Registration) అవసరం లేదు. 

ఒకినావా లైట్

ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 66,993 (ఎక్స్-షోరూమ్). ఇందులో  250W మోటార్ ఉంటుంది. ఈ స్కూటర్ గరిష్టంగా  25 kmph వేగాన్ని అందుకోగలదు. ఇందులో అందించబడిన 1.25 kWh బ్యాటరీ..  ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 60 కిమీలు నడుస్తుంది. దీనిని 4 నుంచి 5 గంటల్లో 100 శాతం ఛార్జ్ చేయొచ్చు. 

Komaki XGT KM

ఈ కంపెనీ తన లో  స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 56,890 (ఎక్స్-షోరూమ్) ధరకు విక్రయిస్తోంది. 60V 28Ah బ్యాటరీని ఇది ఉపయోగిస్తుంది. దీన్ని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 60-65 కిమీల నడుస్తుంది. పోర్టబుల్ ఛార్జర్‌ని ఉపయోగించి, దాని బ్యాటరీని 4-5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కి.మీ.

Also read : Price Hike : జూన్ 1 బ్యాడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ టూ వీలర్లకు “ఫేమ్” కట్

ఆంపియర్ రియో ​​ఎలైట్

ఈ ఎలక్ట్రిక్  స్కూటర్  2 వేరియంట్‌లు, 4 కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఆంపియర్ రియో ​​ఎలైట్ ధర రూ.60,490 (ఎక్స్-షోరూమ్) నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 48V-2Ah లెడ్-యాసిడ్ బ్యాటరీ నుంచి శక్తిని పొందే 250 వాట్స్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ బ్యాటరీని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 60 కి.మీ నడుస్తుంది.

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా LX

భారత మార్కెట్లో దీని  ఎక్స్-షోరూమ్ ధర రూ.51,440 నుంచి రూ.68,796 వరకు ఉంది. Optima LX  51.2 V బ్యాటరీతో శక్తిని పొందుతుంది.  దీని గరిష్ట వేగం 25 kmph. దీని బ్యాటరీని 4-5 గంటల్లో 100 శాతం ఛార్జ్ అవుతుంది. 

జెమోపై మిసో

Gemopai Miso ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది Goreen E-మొబిలిటీ, Opai Electric కంపెనీల  జాయింట్ వెంచర్ లో తయారైన స్కూటర్. ఈ  మినీ స్కూటర్ లో 48-V 1kW లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీన్ని ఒకసారి  ఛార్జ్‌ చేస్తే  75 కిమీ నడుస్తుంది. దీని ధర రూ. 44,000 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్). దీని గరిష్టముగా  25 kmph వేగంతో నడుస్తుంది. దీన్ని కేవలం 2-3 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయొచ్చు.