Site icon HashtagU Telugu

Sudha Murthy: ఇన్ఫోసిస్ ఛైర్ పర్సన్ సుధామూర్తి గురించి నెట్టింట్లో చర్చ…ఎందుకో తెలుసా..?

Sudha Murthy

Sudha Murthy

సుధామూర్తి….ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ గా అందరికీ సుపరిచితురాలే. ఇన్ఫోసిస్ ఛైర్ పర్సన్ గా మాత్రమే కాదు…సుధామూర్తి చేసే పరోపకాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. తాజాగా ఆమెకు సంబంధించిన ఒక ఫొటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అందులో సుధామూర్తి చేసిన పనిని కొందరు ప్రశంసిస్తుంటే…ఇంకొంతమంది విమర్శిస్తున్నారు.

మైసూరు రాజకుటుంబానికి చెందిన ప్రమోదా దేవి వడియార్ కు వంగి కాళ్లకు నమస్కరించడం పట్ల నెటిజన్లు తప్పుపడుతున్నారు. రాజకుటుంబీకులు కాబట్టి ఆవిధంగా నమస్కారం చేశారా అంటూ విమర్శిస్తున్నారు. అయితే కొందరు మాత్రం సుధామూర్తి చేసిన పనిని సమర్దిస్తున్నారు. కానీ చాలామంది తప్పుబడుతున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండే సుధామూర్తి ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదంటున్నారు.