World Largest Iceberg: కదులుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ

ప్రపంచంలోనే అతి పెద్ద మంచుకొండ కదులుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐస్‌బర్గ్ A23a సముద్రపు అడుగుభాగంలో 30 సంవత్సరాల తర్వాత కదిలినట్లు నిపుణులు పేర్కొన్నారు.

World Largest Iceberg: ప్రపంచంలోనే అతి పెద్ద మంచుకొండ కదులుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐస్‌బర్గ్ A23a సముద్రపు అడుగుభాగంలో 30 సంవత్సరాల తర్వాత కదిలినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ మంచుకొండ ఇప్పుడు బ్రిటీష్ దీవి వైపు కదులుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

అంటార్కిటిక్ తీరం నుంచి ఈ మంచుకొండ విరిగిపడింది. ఇది 1986లో జరిగింది. ఆ భాగం విడిపోయి సముద్రపు అడుగుభాగంలో పడి మంచు ద్వీపంగా మారింది.ఇది 3,884 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మరియు 399 మీటర్ల మందంతో ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రస్తుతం అనేక మార్పులు, బలమైన గాలులు మరియు ప్రవాహాల కారణంగా ఈ మంచుకొండ కదులుతున్నట్లు తొలిసారిగా గుర్తించారు.

A23a దక్షిణ జార్జియా సమీపంలో చిక్కుకుపోతుందని అంచనా. అయితే అలా జరిగితే కొన్ని తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. జార్జియాలో నివసిస్తున్న లక్షలాది సీల్స్ మరియు పెంగ్విన్‌ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని నిపుణులు అంటున్నారు. ఇంత పెద్ద మంచుకొండ ద్వారాపెంగ్విన్‌లు, సీల్స్ మొదలైన వాటికి ఆహారం దొరకడం కష్టంగా మారొచ్చని దీంతో తీవ్ర ప్రాణనష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మంచుకొండ కాలక్రమేణా కరిగిపోతుందని మరికొందరు నిపుణులు భావిస్తున్నారు.

Also Read: Telangana: కేసీఆర్ నడిచే రోడ్డు, చదివిన పాఠశాల కాంగ్రెస్‌ నిర్మించిందే: రాహుల్