Viral Video : కొత్త బైక్ కొన్న ఆనందంలో ఓ భర్త చేసిన పనికి ఇంటర్నెట్ మొత్తం వైరల్..!!

భార్యాభర్తల బంధం చాలా గొప్పది. ప్రేమ, గౌరవంతో రోజురోజుకు ప్రేమ మరింత బలపడుతుంది.

  • Written By:
  • Publish Date - October 14, 2022 / 03:45 PM IST

భార్యాభర్తల బంధం చాలా గొప్పది. ప్రేమ, గౌరవంతో రోజురోజుకు ప్రేమ మరింత బలపడుతుంది. పెళ్లయిన కొత్తలో ప్రతి విషయంలోనూ ప్రేమ కనిపిస్తుంది. కానీ అది రాను రాను తగ్గిపోతుంది. అది పక్కన పెడితే…ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. ప్రతి భార్య తన భర్త నుంచి పొందే ప్రేమ ఇదే అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో కూడా సరిగ్గా అదే కనిపిస్తుంది. భర్త మోటార్ సైకిల్ కొన్నాడు. అతను తన భార్యతో కలిసి షోరూమ్ కు వెళ్లాడు. అక్కడ కొత్త బైక్ కు పూలమాల వేయమని…కోరగా…అతను తన భార్య మెడలో పూలమాల వేయబోతాడు. అతని భార్య నాకు కాదు వేయాల్సింది…బైక్ కు అని చెప్పడంతో..అతను బైక్ పూలమాల వేస్తాడు. భార్యపై అతనికున్న ప్రేమకు అక్కడున్నవారంతా నవ్వుతారు.

ఈ వీడియోను జిందగీ గుల్జార్ హై పేరుతో ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోకు 3500వ్యూస్ రాగా..900మంది లైక్ చేశారు. 200మంది రీట్వీట్ చేశారు. విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఎంతఅందమైన వీడియో అని కొందరు కామెంట్ చేస్తే…భార్య అంటే గౌరవం అని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు.