చారాన కోడికి…బారాన మసాలా…ఈ సామేత వినే ఉంటారు. ఈ సామేత బెంగుళూరులోని ఓ కారు యజమానికి సరిగ్గా సరిపోతుంది. అసలు విషయం ఏంటంటే…ఈ మధ్య బెంగుళూరులో భారీగా వర్షాలు కురిసాయి. అనేక వాహనాలు నీటమునిగాయి. వరదల్లో చిక్కుకున్న వాహనాలను రీపేయిర్ చేయించేందుకు సర్వీస్ సెంటర్లకు క్యూ కట్టారు కార్ల యజమానులు.
ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన కారును సర్వీస్ సెంటర్ లో రీపేర్ కు ఇచ్చాడు. ఆ కారు రిపేర్ చేయడానికి దాదాపు 20 రోజుల సమయం పట్టింది. రిపేర్ చేసిన తర్వాత బిల్లును ఆ కారు యజమానికి పంపించారు. బిల్లు చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా కంగుతిన్నాడు. కారు రిపేర్ చేసినందుకు రూ. 22లక్షలు అయ్యింది. తన కారు ధర రూ. 11లక్షలు. ఆ బిల్లుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కారు యజమాని సర్వీస్ సెంటర్ నుంచి ఆ కారును తీసుకోలేదట. అసలు నాకు మార్కెట్ వ్యాల్యూ 6 లక్షలు. 20లక్షల కట్టి కారు తీసుకోవాలా అంటూ అక్కడే వదిలేశాడట.