Site icon HashtagU Telugu

Rat Milk – 18 Lakhs : లీటరు ఎలుక పాలు రూ.18 లక్షలు.. ఎందుకు ?

Rat Milk 18 Lakhs

Rat Milk 18 Lakhs

Rat Milk – 18 Lakhs : ఒంటె పాలు, గాడిద పాలు కాస్ట్లీ అని మనకు తెలుసు!!  మీకు తెలుసా ? ‘ఎలుక పాలు’ వాటి కంటే  కాస్ట్లీ !! ‘ఎలుక పాలు’ధర వింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. లీటరు ఎలుక పాల ధర దాదాపు రూ. 18లక్షలు (23 వేల యూరోలు).  లీటరు ఎలుక పాలను కొనే రేటులో మనం ఈజీగా సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని కట్టుకోవచ్చు. ఓ మంచి వ్యాపారాన్ని కూడా పెట్టుకోవచ్చు. 3 కిలోలకుపైగా బంగారాన్ని సైతం కొనుక్కోవచ్చు. ఇంతకీ ఎలుక పాలు ఎందుకంత కాస్ట్లీ ? అంటే.. ఎలుక చాలా చిన్నప్రాణి.  దాని శరీరంలో పాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. లీటరు ఎలుక పాలను సేకరించడం అంత ఈజీ విషయం కాదు. లీటరు ఎలుక పాలను సేకరించేందుకు 40వేల ఎలుకలు అవసరం అవుతాయి. ఇక ఇదే సమయంలో ఒక ఆవు ఏడాదికి 10 వేల లీటర్ల పాలు, బ్లూ వేల్ రోజుకు 600 లీటర్ల పాలను ఇస్తుంది.

We’re now on WhatsApp. Click to Join

ఇంతకీ ఎలుక పాలను ఎందుకు వాడుతారు ? అంటే..  మలేరియా బాక్టీరియాను చంపే మెడిసిన్స్ తయారీకి వాడుతారట.  గేదె పాల కంటే ఆవు పాలలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. ఆవు పాల కంటే ఎలుక పాలలో నాలుగు రెట్లు ఎక్కువ పోషకాలు ఉంటాయట. అందుకే శాస్త్రవేత్తలు ఎలుక పాలను పరిశోధనల కోసం వినియోగిస్తున్నారని చెబుతున్నారు. ఎలుక డీఎన్ఏ ఇతర జంతువుల డీఎన్ఏ కంటే ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే వివిధ ఔషధ ప్రయోగాలు చేయడానికి, ఆ ఫలితాలను ఎనలైజ్ చేయటానికి ఎలుక పాలను వాడుతుంటారట. ఎలుక పాల ధరకు సంబంధించిన ఒక పోస్టు సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది.

Also read : King Nag@100: ప్రతిష్టాత్మకంగా నాగ్ వందో సినిమా.. డైరెక్టర్ ఎవరో మరి

ఎలుకల మీద చాలా రీసెర్చ్ జరుగుతోంది. ప్రయోగశాలలో ఎలుకల పిండాలను రూపొందించే అధ్యయనం కూడా జరుగుతోంది. రెండు మగ ఎలుకల నుంచి పిండాన్ని ఉత్పత్తి చేసేందుకు ఇప్పటికే ప్రయోగం చేశారు. ఈ పిండాలు ఇతర పిండాల మాదిరిగానే నిర్మాణాలను కలిగి ఉన్నాయని రీసెర్చ్ రిపోర్ట్స్ ను బట్టి తెలుస్తోంది. చైనాలోని ఓ ప్రయోగశాలలో సిజేరియన్ ద్వారా ఓ మగ ఎలుక పది ఎలుక పిల్లలకు జన్మనిచ్చింది. ‘ర్యాట్‌ మోడల్‌ 6’ పేరిట ఈ ప్రయోగాన్ని చేశారు.