Site icon HashtagU Telugu

Robber Emotional : హగ్ తో దొంగ ఎమోషనల్.. కట్ చేస్తే..

Robber Emotional

Robber Emotional

Robber Emotional : దొంగ దొరికితే.. కుమ్మేయడమే మనకు తెలిసిన విద్య.

కానీ ఆ పెద్దాయన .. దొంగను కూడా ప్రేమతో జయించాడు.

బ్యాంకు క్యాష్ కౌంటర్ దగ్గర లూటీ కోసం నిలబడిన దొంగను ఎమోషనల్ చేసి, ఏడ్పించాడు. 

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం వుడ్‌ల్యాండ్ సిటీలో ఉన్న “బ్యాంక్ ఆఫ్ ది వెస్ట్” బ్రాంచ్‌ అది.. 69 ఏళ్ల మైఖేల్ ఆర్మస్ చెక్‌ను డిపాజిట్ చేయడానికి ఆ బ్యాంక్ కు వచ్చాడు. సరిగ్గా ఇదే టైం లో బ్యాంకులోని ఒక క్యాష్ కౌంటర్ దగ్గర ఏదో గొడవ జరుగుతోంది. ఎవరూ పెద్దగా ఆ గొడవను పట్టించుకోవడం లేదు. కానీ మైఖేల్ ఆర్మస్ ఏదో జరుగుతోందని అనుమానించాడు. ఆ క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్లి.. బ్యాంకు ఉద్యోగిని బెదిరిస్తున్న 42 ఏళ్ళ వ్యక్తిని గమనించాడు. “క్యాష్ కౌంటర్ లో ఉన్న డబ్బులన్నీ నాకు ఇచ్చేయ్.. లేదంటే నా బ్యాగులో ఉన్న పేలుడు పదార్థాలను బ్లాస్ట్ చేస్తాను” అంటూ ఆ దుండగుడు బెదిరిస్తున్నాడు.  ఆ మాటలు విని బ్యాంకు  ఉద్యోగికి చెమటలు పడుతున్నాయి. ఈ టైం లో కౌంటర్ దగ్గరే ఉన్న మైఖేల్ ఆర్మస్ కలుగజేసుకున్నాడు. ఆ దుండగుడితో మాట్లాడాడు. “నిన్ను ఎక్కడో చూసినట్టు ఉందయ్యా.. గతంలో మా ఏరియాలో ఉండే వాడివి కదూ” అని మైఖేల్ ఆర్మస్ పలకరించాడు. స్పందించిన దొంగ.. “లేదు.. నాకు ఈ సిటీలో ఎవరూ లేరు” అని పెద్దాయనకు చెప్పాడు. “ఇంతకీ ఇప్పుడు ఏ జాబ్ చేస్తున్నావ్ నువ్వు ?” అని మైఖేల్ ఆర్మస్ ఇంకో ప్రశ్న అడిగాడు. దానికి దొంగ బదులిస్తూ.. ” నేను ఏ పనీ చెయ్యట్లేదు. జైలుకు వెళ్లడమే నా టార్గెట్” అని చెప్పాడు.

Also read : Car Theft: కారు దొంగలించిన ముగ్గురు దొంగలు.. ఎవరికి డ్రైవింగ్ రాదు.. చివరికి?

ఆ తర్వాత దొంగతో ముచ్చటను మైఖేల్ ఆర్మస్ మరింత సాగదీశాడు. దొంగపై ఆప్యాయంగా చెయ్యి వేసుకొని.. మాటల్లో పెట్టి..  క్యాష్ కౌంటర్ కు కొంచెం దూరంగా తీసుకెళ్లాడు. దీంతో వెంటనే బ్యాంక్ వాళ్ళు పోలీసులకు కాల్ చేసి బ్యాంకులో దొంగ పడ్డాడని సమాచారం ఇచ్చారు. మరోవైపు 69 ఏళ్ల మైఖేల్ ఆర్మస్ ప్రేమగా ఆ దొంగను కౌగిలించుకున్నాడు. దీంతో ఎమోషనల్ (Robber Emotional) అయిన దొంగ .. మీ ప్రేమను మర్చిపోలేను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో దొంగ తన పేరు ఎడ్వర్డో ప్లెసీసియో అని చెప్పాడు. తన దగ్గర బాంబులు, పేలుడు పదార్థాలు లేవని.. కేవలం బ్యాంకు ఉద్యోగిని భయపెట్టి డబ్బులు కాజేయాలని ప్లాన్ చేశానని ఒప్పుకున్నాడు. మరోవైపు పెద్దాయన మైఖేల్ ఆర్మస్.. తాను త్వరలోనే జైలుకు వెళ్లి మరీ దొంగ ఎడ్వర్డో ప్లెసీసియోను కలుస్తానని అంటున్నాడు. ప్రేమతో ఎవరిలో అయినా మార్పును తీసుకురావచ్చని ఆయన అంటున్నారు.

Exit mobile version