Viral Video : ఎగురుతున్న విమానంలో ప్రయాణీకుడు రచ్చ రచ్చ..సిబ్బంది వేలు కొరకడంతో…!!

అత్యవసరమైతేనే ఎగురుతున్న విమానాన్ని ల్యాండింగ్ చేస్తారు. కానీ ఓ ప్రయాణీకుడు సృష్టించిన వీరంగాన్ని భరించలేక...అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశాడు పైలెట్.

Published By: HashtagU Telugu Desk
Indian Aviation History

Indian Aviation History

అత్యవసరమైతేనే ఎగురుతున్న విమానాన్ని ల్యాండింగ్ చేస్తారు. కానీ ఓ ప్రయాణీకుడు సృష్టించిన వీరంగాన్ని భరించలేక…అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశాడు పైలెట్. విమానంలో ఓ ప్రయాణీకుడు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. చిన్నపాటి చర్చ కాస్త పెద్దగా మారింది. దీంతో ఆ ప్రయాణీకుడు ఎయిర్ హోస్టెస్ వేలు కొరికాడు. అంతేకాదు ఇతర ప్రయాణీకులపై పిడిగుద్దులతో రెచ్చిపోయాడు. దీంతో పైలెట్ ఫ్లైట్ ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

డైలీ స్టార్ కథనం ప్రకారం..టర్కిష్ ఎయిర్ లైన్స్ విమానం..ఇస్తాంబుల్ నుంచి ఇండోనేషియా రాజధాని జకార్తాకు వెళ్తోంది. అందులో ఓ ప్రయాణికుడు సిబ్బందితో గొడవకు దిగాడు. ఆ ప్రయాణికుడు అప్పటికే పీకల్లోతు మద్యం సేవించాడు. చిన్న పాటి చర్చ కాస్త పెద్ద గొడవకు దారి తీసింది. ప్రయాణికుడు సిబ్బందిపై ఎదురుదాడికి దిగాడు. ఎయిర్ హోస్టెస్ వచ్చి ప్రశాంతంగా ఉండాలని హెచ్చరించింది. అతను పట్టించుకోలేదు. అంతేకాదు ఫ్లైట్ లో ఉన్న ఇతర ప్రయాణీకులతోనూ గొడవకు దిగాడు. దీంతో ప్రయాణీకులంతా కలిసి అతన్ని చితకబాదారు. దీంతో ఆ ప్రయాణీకుడు ఎయిర్ హోస్టెస్ వేలు కొరకాడు. గొడవ కాస్త పెద్దది కావడంతో ప్లైట్ తో గందరగోళం ఏర్పడింది. చేసేదేం లేక పైలెట్ కౌలానాము ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికుడిని మహమ్మద్ జాజ్ బౌడ్విజన్ గా గుర్తించారు. అతన్ని విమానం నుంచి బయటకు పంపించేశారు. ఇప్పుడా వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

  Last Updated: 16 Oct 2022, 07:18 PM IST