Site icon HashtagU Telugu

Unfit Cops: పంజాబ్ పోలీసులపై హైకోర్టు సీరియస్… 80 వేల మంది ఏం చేస్తున్నారంటూ !

891dd783 16ae 480e 9a76 5273c1170dc9

891dd783 16ae 480e 9a76 5273c1170dc9

Unfit Cops: పంజాబ్ అట్టడుకుతోంది. వేల మంది పోలీసులు హై అలర్ట్ లో ఉన్నారు. ఒక్కరోజంతా ఇంటర్నెంట్ బంద్ చేశారు. కేవలం ఓ వ్యక్తిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ పట్టుకోలేకపోయారు. అతడు ఎవరో కాదు ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్.

సిక్కు పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నిచింది. ఇప్పుటి ప్రస్తుత నివేదికను సమర్పించాలని పోలీసులు పంజాబ్ హరియాణా హైకోర్టు ఆదేశించింది.ఇదే సమయంలో వేల మంది పోలీసులు ఒక్కడ్ని పట్టుకోలేకపోయారా మీరంతా ఏం చేస్తున్నారని అక్షింతలు వేసింది. మీరు 80 వేల మంది పోలీసులు ఉన్నారు. అటువంటిప్పుడు అమృత్‌పాల్ సింగ్ ఎలా తప్పించుకున్నాడు అని పంజాబ్ ప్రభుత్వాన్ని నిలదీసింది.

ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ గత శనివారం పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నారు. అప్పటి నుంచి పంజాబ్ వ్యాప్తంగా అతడి కోసం పోలీసులు,సైన్యం జల్లెడపడుతున్నాయి.ఇక అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకోడానికి శనివారం భారీ ఆపరేషన్ చేపట్టామని ఇప్పటి వరకూ అతడి మద్దతుదారులను 120 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు.బాలీవుడ్ సినిమాను తలపించేలా 100 కార్లతో అతడ్ని దాదాపు 25 కిలోమీటర్ల ఛేంజ్ చేశారు. అయినాసరే అతడు పోలీసుల కళ్లుగప్పి మోటార్ సైకిల్‌పై పారిపోయాడు.