Robbery Caught On Cam : అమెరికాలోని ఎన్నారై బంగారు షాపులో దోపిడీ

అమెరికాలోని ఇండియ‌న్ షాపుల మీద కొంద‌రు దుండ‌గులు దోపిడీకి తెగ‌బ‌డ్డారు.

  • Written By:
  • Publish Date - June 11, 2022 / 12:19 PM IST

అమెరికాలోని ఇండియ‌న్ షాపుల మీద కొంద‌రు దుండ‌గులు దోపిడీకి తెగ‌బ‌డ్డారు. బంగారు దుకాణంలోకి తుపాకుల‌తో దూరిన కొంద‌రు ముసుగుదొంగ‌లు ప‌ది నిమిషాల పాటు హ‌ల్ చ‌ల్ చేశారు. దొరికినంత దోచుకుని వెళ్లిపోయారు. ఆ స‌మ‌యంలో షాపు యాజ‌మాన్యం ప్రాణాల‌ను అర‌చేతిలో ప‌ట్టుకున్నారు. దుండ‌గులు వెళ్లిన త‌రువాత పోలీసుల‌కు ఫోన్ చేయ‌డంతో క్ష‌ణాల్లో కొన్ని వంద‌ల మంది పోలీసులు వాహ‌నాల్లో దిగారు.

భార‌తీయులు ఎక్కువ‌గా ఉండే న్యూజెర్సీ ప్రాంతంలని ఇండియ‌న్ మార్కెట్ లో ఈ దోపిడీ ఇండియ‌న్ టైం ప్ర‌కారం శ‌నివారం ఉద‌యం 6 నుంచి 6.30 గంట‌ల మ‌ధ్య జ‌రిగింది. అమెరికా టైం ప్ర‌కారం అయితే శుక్ర‌వారం రాత్రి ఈ దోపిడీ చోటుచేసుకుంది. అక్క‌డ OMG, oak tree పేరుతో ఉన్న న‌గ‌ల దుకాణంలో ప్ర‌వేశించిన దండ‌గులు చేసిన దోపిడీ సీసీ కెమెరాల్లో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు కనిపిస్తోంది. ఆ దృశ్యాల‌ను చూస్తే అమెరికాలో దోపిడీ కూడా వినూత్నంగా ఉంటుంద‌ని అర్థం అవుతోంది. అదే ప్రాంతంలో భార‌త్ కు చెందిన 10 బంగారం దుకాణాలు ఉన్నాయి. హోటల్స్, చికెన్ స్టాల్స్, నిత్యావ‌రాల, రెడీమేడ్ శారీస్, డ్రైక్లీన‌ర్స్, లిక్క‌ర్ స్టోర్స్ ఇలా సుమారు 100 షాపులు ఉన్నాయి. అవ‌న్నీ గుజ‌రాత్ రాష్ట్రానికి చెందిన భార‌తీయుల‌కు చెందిన‌వి.

సాధార‌ణంగా భార‌త‌దేశంలో దోపిడీ జ‌రుగుతోన్న స‌మ‌యంలో ప్ర‌తిఘ‌టించే ప్ర‌య‌త్నం చేస్తారు. అంతేకాదు, పోలీసుల‌కు వెంట‌నే ఎవ‌రో ఒక‌రు స‌మాచారాన్ని ఇస్తారు. కానీ, అమెరికాలోని బంగారు షాపులో జ‌రిగిన దోపిడీని సీసీ కెమెరా ఫుటేజ్ ల్లో చూస్తే య‌జ‌మానులు నేల మీద పడిపోయారు. నేల మీద సాగిలా ప‌డిన దృశ్యాల‌ను చూడొచ్చు. దండ‌గులు షాపులోకి ఎంట‌ర్ కాగానే షాపు నిర్వాహ‌కులు వెంట‌నే నేల మీద బోర్లాప‌డుకున్నారు. వాళ్ల నుంచి త‌ప్పించుకోవ‌డానికి మ‌రొక‌రు చాటుగా న‌క్కారు. అమెరికాలో దొంగ‌త‌నమైన‌, దొర‌త‌న‌మైన అంతా వెర‌టీనే!