100 Billion Dollars : 100 బిలియన్ డాలర్లు అంటే మామూలు విషయం కాదు.. 8 లక్షల కోట్ల రూపాయలు!! ఇంత భారీ సంపదకు ప్రపంచంలోనే తొలిసారిగా ఒక మహిళా మణి కూడా అధిపతిగా మారారు. ఆమె పేరే ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్(70). బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఈవిషయాన్ని వెల్లడించింది. ఈమె ఏ కంపెనీకి ఓనరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వాళ్ల కంపెనీ తయారు చేసే షాంపూ సహా వివిధ బ్యూటీ ప్రోడక్టులను మనం ఇండియాలో వాడుతుంటాం. ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ ఫ్రాన్స్ దేశస్తురాలు. వాళ్ల కంపెనీ పేరు లోరియాల్ ఎస్ఏ (L’Oreal SA) !! అదేనండీ లోరియాల్ షాంపూ వీళ్ల కంపెనీదే.
We’re now on WhatsApp. Click to Join.
లోరియాల్ బ్యూటీ ప్రోడక్ట్స్ కంపెనీని ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ వాళ్ల తాతయ్య యూజీన్ షుల్లెర్ 1909 సంవత్సరంలో స్థాపించారు. యూజీన్ షుల్లెర్ ఒక రసాయన శాస్త్రవేత్త. ఆయన తయారు చేసిన హెయిర్ డైని ఉత్పత్తి చేసి విక్రయించడానికి తొలుత లోరియాల్ కంపెనీని స్థాపించారు. ఆ తర్వాత ఇతరత్రా బ్యూటీ ప్రోడక్ట్స్ తయారీ విభాగాల్లోకి కూడా లోరియాల్ ఎంటరైంది. ఇప్పుడు ఆ బిజినెస్‌ను ఫ్రాంకోయిస్ లీడ్ చేస్తున్నారు. వైస్ ఛైర్మన్ హోదాలో కంపెనీని(100 Billion Dollars) నడిపిస్తున్నారు. కంపెనీలో దాదాపు 35 శాతం వాటా ఫ్రాంకోయిస్ కుటుంబం చేతిలోనే ఉంది. L’Oreal SA కంపెనీ షేర్లు రికార్డు స్థాయి ధరలకు పెరగడంతో ఆమె సంపద విలువ అమాంతం పెరిగి రూ.8 లక్షల కోట్లకు ఎగబాకింది. లోరియాల్ కంపెనీ షేర్లు 1998 తర్వాత ఇంత భారీగా పెరగడం ఇదే తొలిసారి అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ప్రపంచ ధనవంతుల జాబితాలో మెక్సికోకు చెందిన కార్లోస్ స్లిమ్ 11వ ప్లేస్‌లో ఉండగా.. 12 ప్లేస్‌కు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్‌కే చెందిన లగ్జరీ వస్తువుల తయారీ కంపెనీ LVMH వ్యవస్థాపకుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల ర్యాంకింగ్ లో రెండో స్థానంలో ఉన్నారు. ఈయన సంపద 14 లక్షల కోట్లు.